kamineni srinivas returned back without meeting pushkaram victims

Bitter experience to minister kamineni srinivas

bitter experience to minister kamineni srinivas, kamineni srinivas returned back without meeting pushkaram victims, godavari pushkaram, rajamundry, stampede, kamineni srinivas, pilgrimage, rajamundry government hospital, temple, rajamundry pushkara ghat, deceased families, opposition parties

andhra pradesh minister kamineni srinivas had bitter experience as opposition parties stage dharna at rajamundry government hospital. He returned back without meeting pushkaram victims

మంత్రి కామినేని శ్రీనివాస్ కు చేధు అనుభవం

Posted: 07/14/2015 04:15 PM IST
Bitter experience to minister kamineni srinivas

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద మంత్రి కామినేని శ్రీనివాస్ కు చేదు అనుభవం ఎదురైంది రాజమండ్రి పుష్కరఘాట్ లో జరిగిన తొక్కిసలాటలో క్షతగాత్రులను, మృతుల బంధువులను పరామర్శించేందుకు వచ్చిన కామినేనిని విపక్షాలు అడ్డుకున్నాయి. రాజమండ్రి పుష్కర్‌ఘాట్‌లోజరిగిన తొక్కిసలాటకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అరకోర ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. ప్రచారా ఆర్భాటాన్నికే అధిక ప్రాధ్యాన్యత ఇచ్చిందని విఫక్షాలు ఆరోపించాయి.

పుష్కరాల పేరుతో ప్రభుత్వం ధన దోపిడికి తేరలేపడంతోనే ఇలాంటి అపశృతులు చోటుచేసుకుంటున్నాయని బాధిత కుటుంబాలు కూడా ఆరోపిస్తున్నాయి. అన్ని ఘాట్ లకు ఒకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం కూడా కేవలం రాజమండ్రి ఘాట్ కే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో.. అక్కడికే అధిక సంఖ్యలో భక్తులు రావడంతోనే తొ్క్కిసలాట జరిగిందని భాదిత బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కాన్వాయ్‌ను విపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో ఆయన క్షతగాత్రులను పరామర్శించకుండానే వెనుదిరిగారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : godavari pushkaram  rajamundry  stampede  kamineni srinivas  pilgrimage  

Other Articles