రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించిన ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని కాంగ్రెస్ నేత చిరంజీవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఘటనపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాటలో 27 మంది మృతిచెందడం దిగ్ర్భాంతికి గురిచేందన్నారు. మీడియాలో తొక్కిసలాట దృశ్యాలు చూస్తుంటే గుండెతరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి ఇచ్చిన ప్రాధాన్యత.. ఏర్పట్లు చేయడంలో తీసుకోలేదని విమర్శించారు.
పుష్కరాలకు ఎంతమంది వస్తారనేది అంచనా వేయలేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని చంద్రబాబు చెప్పడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. పుష్కరాలకు అన్ని తానై ఉన్న చంద్రబాబు నాయుడు తొక్కిసలాట ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కృష్ణా పుష్కరాల సమయంలో ఇద్దరు ముగ్గురు చనిపోతే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నానాయాగీ చేశారని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన ఇప్పుడు అదే నైతిక బాధ్యత వహించి..చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పుష్కరాల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. పుష్కరాలకు భారీ ఎత్తున్న ప్రచారం చేసిన లక్షాలాధి మంది వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం అందుకు తగ్గస్తాయిలో ఏర్పాట్లు చేయలేకపోయిందని విమర్శించారు. వందల కోట్లను ఖర్చు చేసినా.. పూర్తి స్థాయిలో ఏర్పాటు జరగకపోవడం ప్రభుత్వం వైఫల్యం కాకమరోటి కాదన్నారు. స్వయంగా చంద్రబాబు పుష్కర పనులను పర్యవేక్షించినా.. ఇలాంటి అపశృతులు చోటుచేసుకోవడంపై ప్రభుత్వాన్ని నిందించారు. తనను తాను గొప్ప అడ్మినిష్ట్రేటర్ గా చెప్పుకునే చంద్రబాబు, ఘాట్ లలో ఎంతమంది వస్తున్నారు. ఎంత మంది బయటకు వెళ్తున్నారన్న విషయాలను కూడా సరిగా అంచనా వేయలేకపోయారని ఆయన తూర్పారబట్టారు.
మహాకుంభమేళాకు గోదావరి పుష్కరాల కంటే పలు రెట్లు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారని అయినా ఎక్కడా ఎలాంటి అపశృతులు జరగవని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పలు మీడియా సంస్థలను కూడా ఆయన చురకలు అంటించారు. కొంతమంది మీడియా వ్యక్తులు చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని, ఇలాంటి ఘోరాలు కూడా వారికి పట్టవా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు తాను రాజమండ్రికి బయలుదేరి పుష్కరాల ఏర్పట్లలో ఎలాంటి లోపాలున్నాయనేది పరిశీలించుకుంటామని చిరంజీవి చెప్పారు. పుష్కర తోక్కిసలాటకు కారణాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలను పరామర్శించి. వారికి న్యాయజరిగేలా చూస్తామని చిరంజీవి చెప్పారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more