andhrapradesh | telangana | Godavari Pushkaralu | Piigrims | Devotees

Lakhs of pilgrims take pushkar plunge in telangana and andhrapradesh

andhrapradesh, telangana, Godavari Pushkaralu, Piigrims, Devotees

Lakhs of Pilgrims Take Pushkar Plunge in Telangana and andhrapradesh A spirit of religious fervour gripped lakhs of pilgrims, who descended on the ghats along the banks to river Godavari, after 12 years of long wait to take the holy dip in the river at the auspicious moment on Tuesday. Almost all Pushkaram ghats in Telangana witnessed heavy rush as pilgrims jostled to take the holy dip as Pushkarams dawned.

దారులన్నీ గోదారికే.. తొలిరోజే 24 లక్షల మంది పుష్కర స్నానం

Posted: 07/15/2015 09:00 AM IST
Lakhs of pilgrims take pushkar plunge in telangana and andhrapradesh

గోదావరి మహా పుష్కరాల తొలి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 24 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లకు మంగళవారంనాడు భక్తులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్-లోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లలో సుమారు 15 లక్షల మంది, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మరో 5 లక్షల మంది, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మరో 4 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అంచనా. రాజమండ్రిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా ధర్మపురిలో కుటుంబంతో సహా పుణ్యస్నానం చేశారు. ఇద్దరు సీఎంలూ ఆయా ప్రదేశాల్లో గోదారమ్మకు పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు.

Also Read:  చావు రాజకీయాలు అంటే ఇవే..!

రాజమండ్రి పుష్కరాల్లో చోటుచేసుకున్న దుర్ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా వచ్చిన గోదావరి పుష్కరాలు కావడంతో తెలంగాణ సర్కార్ కూడా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. సిఎం కేసీఆర్ గోదావరి పుష్కరాల మీద ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి చర్యలకు దిగుతారు.. ఎలా స్పందిస్తారు అంటూ అధికారులకు అడిగి తెలుసుకున్నారు.

Also Read:  విషాదం తీవ్రంగా కలిచి వేసిందంటూ పవన్ ట్వీట్..

నిన్నటితో ప్రారంభమైన గోదావరి మహా పుష్కరాలు మరో పదకొండు రోజుల పాటు సాగనున్నాయి. అయితే ఏపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్సాట్లు చేశాయి. తెలుగు రాష్ట్రాల నుండు కాకుండా దేశంలోని చాలా ప్రాంతాలు, విదేశాల నుండి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని అంచనా. అయితే రాజమండ్రి పుష్కరాల్లో చోటు చేసుకున్న దుర్ఘటన రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ ఇచ్చింది. దాంతో ప్రభుత్వం చేస్తున్న ఏర్పట్లలో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టింది. మొదటి రోజే 24 లక్షల మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుష్కర స్నానం చేశారు. అయితే పుష్కరాలు ముగిసేసరికి కోటి దాకా భక్తులు పుష్కర స్నానం చేస్తారని అంచనా. ఈ పదకొండు రోజులు ఎలాంటి దుర్ఘటన జరగకుండా ప్రశాంతంగా పుష్కరాలు ముగియాలని ఆశిద్దాం.

By Abhinavachary

Also Read: పెరుగుతున్న మృతుల సంఖ్య.. గోదావరి పుష్కరాల్లో మహా విషాదం
Also Read:  పుష్కరాలకు వెళ్లే వాళ్లూ జాగ్రత్త.. ఇవి పాటించండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  telangana  Godavari Pushkaralu  Piigrims  Devotees  

Other Articles