పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులపై టీడీపీ నేతలకు తాను విసిరిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణా రావు పునరుద్ఘాటించారు. ఈమేరకు మరోసారి టీడీపీ నేతలకు బహిరంగ లేఖ రాశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై సవాల్‌కు కట్టుబడి ఉన్నానని, దీనిపై చర్చించేందుకు గురువారం ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు తాను వస్తానని, పూర్తి ఆధారాలతో మీరూ రావాలని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ ఈ వేదిక ఆమోదయోగ్యం కాకుంటే మీరు చెప్పిన చోటుకే వస్తానని అన్నారు. చర్చకు నిజనిర్థారణ కర్తలుగా వ్యవహరించడానికి జర్నలిస్టు యూనియన్ నేతలు అంగీకరించారని మంత్రి జూపల్లి తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ టీడీపీ నేతలకు పాలమూరు ప్రాజెక్టులపై చర్చించే దమ్ము లేదని జూపల్లి ధ్వజమెత్తారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డితో బహిరంగ చర్చ జరిపేందుకు జూపల్లి అసెంబ్లీ కమిటీ హాల్‌కు ఈ ఉదయం 10.30 గంటల సమయంలో వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూశారు. రావుల రాకపోయే సరికి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ టీడీపీ నేతలు మాటలకే పరిమితమయ్యారు అని మండిపడ్డారు. మాటలు పక్కన పెట్టి చర్చకు వస్తే నిజాలు ఏంటో తెలుస్తాయన్నారు. అసెంబ్లీ కమిటీ హాలుకు రాలేము అనుకుంటే మీరే హైదరాబాద్ నగరంలోని ఏదైనా ఫంక్షన్ హాలులో చర్చ పెట్టండి. నేనే అక్కడికి వస్తా. అవసరమైతే ఫంక్షన్ హాలు కిరాయి కూడా తానే భరిస్తానన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీల్లోకి రావొచ్చు. ఏదో సాకు చెబుతూ తప్పించుకు తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. వారికి చర్చకు దమ్ము లేకుంటే.. మీ చంద్రబాబుతో ఒక లేఖ రాయించండి. పాలమూరు ఎత్తిపోతల విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రానికి, సీడబ్ల్యూసీకి లేఖ రాయించండి అని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో రూ. 7,800 కోట్లు కేటాయించి రూ. 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని బాబు లేఖ రాశారని నిరూపిస్తానన్నారు. ఇప్పటికీ తన మాటకు కట్టుబడి ఉన్నానని జూపల్లి పునరుద్ఘాటించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more