tdp leader pradeep says he have no connection with cash for vote case

Acb issues notices to tdp leader pradeep in cash for vote

cash on vote, ACB, tdp leader Pradeep, note for vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

Telangana acb officials issues notices to jubliee hills mla maganti main follower and tdp leader pradeep in cash for vote

ఓటుకు నోటు కేసులో మరో టీడీపి నేతకు నోటీసులు.. సంబంధం లేదంటున్న ప్రదీఫ్

Posted: 07/19/2015 10:13 AM IST
Acb issues notices to tdp leader pradeep in cash for vote

ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ కేసుతో సంబంధాలు వున్నాయన్న కోణంలో ఇటీవల వేం నరేందర్ రెడ్డి కుమారుడు కష్ణ కీర్తన్ కు నోటీసులు జారీ చేసిన రెండు రోజుల పాటు విచారించిన ఏసీబి.. తాజాగా ఇదే కేసుతో సంబంధాలున్నాయని తేలడంతో తెలుగు యువత నేత ప్రదీప్‌కు ఏసీబీ 160 సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులలో ఏసీబీ ప్రదీప్ ను ఆదేశించింది.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటికి ప్రధాన అనుచరుడిగా వున్న ప్రదీప్ కు నోటీసులు రావడంతో ఈ కేసులో తమ పేర్లు ఎప్పుడు, ఎలా భయటకు వస్తాయోనని మరికోందరు టీడీపీ నేతల గుండెళ్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యతో పాటు ఉదయసింహం, సెబాస్టియన్ రిమాండ్కు వెళ్లి బెయిల్ పై విడుదలయ్యారు. కాగా తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని అయినా ఏసిబి అధికారులు తనకు నోటీసులు ఇవ్వడం కచ్చితంగా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యే అన్న అనుమానం వ్యక్తమవుతుందని ప్రదీప్ మీడియాతో అన్నారు.

న్యాయస్థానాలపై తమకు నమ్మకం వుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన ఏసిబి ముందు వంద శాతం హాజరవుతానని, వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. ఈ కేసులో నిందుతులైన వారు కూడా తనకు తెలియదని, తాను అంత పెద్ద స్థాయి నేతను కాదని వివరణ ఇచ్చారు. ఏసిబీ ఎదుట హాజరైన తరువాత మీడియాకు అన్ని విషయాలు చెప్తానని చెప్పారు. ప్రస్తుతం ప్రదీప్ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ డివిజన్ కు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash on vote  phone tapping  ACB  tdp leader Pradeep  note for vote  

Other Articles