ఢిల్లీలో 19ఏళ్ల యువతిని అతి దారుణంగా పొడిచిన ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీని ఆదేశించింది. బాధితురాలి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారిం ప్రకటించింది. ఢిల్లీలోని ఆనంద్ పర్బాత్ ప్రాంతంలో ఇద్దరు సోదరులు ఈవ్‌టీజింగ్ కు పాల్పడుతుండగా వారిని అడ్డుకున్న యువతిని పొడిచి చంపారు. ఈ విషయమై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అప్ ప్రభుత్వం నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఆనంద్ పర్వత్ ప్రాంతానికి చెందిన మీనాక్షి(19)పై ఆమె ఇంటికి పొరుగునే ఉంటున్న జై ప్రకాష్(21), అతని సోదరుడు గతంలో వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై ఆమె 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి మీనాక్షి.. సమీపంలోని మార్కెట్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇది గమనించిన దుష్ట సోదరులిద్దరూ ఆమెను వెంబడించి, అడ్డు నిలబడి మరోసారి వేధింపులకు పాల్పడ్డారు. దీంతో మీనాక్షి వాళ్లిద్దరిపైనా తిరగబడింది. దీంతో రెచ్చిపోయిన సోదరులు తొలుత దాడికి దిగడంతో మీనాక్షి తప్పించుకునేందుకు యత్నించింది.
దీంతో మరింతగా రెచ్చిపోయిన ముష్కరులు తమ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డారు. విచక్షణ రహితంగా ఆమెను కత్తితో పొడిచారు. నెత్తురోడుతున్న శరీరంతో ఆర్తనాదాలు చేస్తూ పరుగెత్తిన మీనాక్షి... సమీపంలోని ఓ భవనంలోకి ప్రవేశించి తనను రక్షించమని వేడుకుంది. అయితే, ఆ ఇంట్లోనివారు ఆమెను బయటకు నెట్టి తలుపులు మూసేశారు. దీంతో ముష్కరులు ఆమెపై మరోసారి దాడి చేసి పలుమార్లు కత్తితో పొడిచారు. దీంతో మీనాక్షి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే ముష్కర సోదరులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాధితురాలి పట్ల స్థానికులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని మీనాక్షి సోదరి కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనపై ఆప్ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఢిల్లీలో పోలీసులు ఏం చేస్తున్నారంటూ మండిపడింది. ఢిల్లీ పోలీసులు ఢిల్లీ ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించలేని పరిస్థితిలో వున్నారని విమర్శించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more