Amaravathi | Seed capital | AP | chandrababu naidu | Singapur, Eeshwaran, Rajahmundry

Amravati seed capital plan will be discover today

Amaravathi, Seed capital, AP, chandrababu naidu, Singapur, Eeshwaran, Rajahmundry

singapur govt will submit the master plan of seed capital of andhra pradesh. After visiting Rajahmundry pushkaralu the singapur delegates wil submit the plan.

అమరావతి సీడ్ కేపిటల్ ప్లాన్ ఆవిష్కరణ నేడే

Posted: 07/20/2015 08:27 AM IST
Amravati seed capital plan will be discover today

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టా త్మక నూతన రాజధాని నగరం అమరావతి నిర్మా ణానికి సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌ నేడు ప్రభుత్వం చేతికి అందనుంది. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం హైదరాబాద్‌ చేరుకుంది. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి రావెల కిషోర్‌బాబు శంషాబాద్‌ విమానా శ్రయంలో ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో రాజమండ్రి బయలుదేరనున్నారు. ఉదయం పుష్కర స్నానం ఆచరించిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రిమండలి సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌ను ఆవిష్కరిస్తారు.

సాయంత్రం జరిగే గోదావరి హారతి కార్యక్రమంలో ఈశ్వరన్‌ ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ఇప్పటికే సింగపూర్‌ బృందం పూర్తిస్థాయి రాజధాని నిర్మాణానికి మహా ప్రణాళికను ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. అందులో పొందుపరి చిన సమాచారం మేరకు మొత్తం 7,420 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంత అభివృద్ధిని నిర్ధేశించారు. 854 కిలోమీటర్ల పరిధిలో రాజధాని కేంద్ర ప్రాంత ప్రణాళికను రూపొందించారు. పూరి ్తస్థాయి నిర్మాణ స్వరూపంలో సచివాలయం, శాఖాధి పతుల కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మించేం దుకు 217 కిలోమీటర్ల పరిధిని నిర్ణయిం చారు. సులువైన ప్రయాణ సౌలభ్యానికి 127 కిలోమీటర్ల పరిధిలో ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం, 155 కిలోమీటర్ల పరిధిలో ఆరులైన్ల విశాలమైన నగర ప్రధాన రహదారులు, 332 కిలోమీటర్ల పరిధిలో అంతర్గత రహదారులు, 324 కిలోమీటర్ల పరిధిలో పరిపాలనా భవనాలు నిర్మించబోతున్నారు.

135 కిలోమీటర్ల పరిధిలో అమరావతి నగరం చుట్టూ మెట్రో రైలును నిర్మించనున్నారు. నగరంలో 150 కిలోమీటర్ల పరిధిలో పాదచారులకు ప్రత్యేక దారులు, పార్కులు, బైక్‌ ట్రెయిల్స్‌, 170 కిలోమీటర్ల పరిధిలో తీరప్రాంత నిర్మాణాలు, 35 కిలోమీటర్ల పరిధిలో లేక్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం 3000 హెక్టార్లలో రిసార్టులు, 2800 హెక్టార్లలో వాటర్‌ఫాంట్‌ రెసిడెన్సి యల్‌ కాంప్లెక్స్‌లు, 1000 హెక్టార్లలో థీమ్‌ పార్కులు ఏర్పాటు చేస్తారు. 145 కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక పర్యాటక ప్రాంతం, 45 కిలోమీటర్ల పరిధిలో వాటర్‌ సర్క్యూట్‌లు, 61 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు సర్క్యూ ట్‌లు నిర్మించాలని సింగపూర్‌ బృందం ప్రభుత్వానికి సమర్పించిన మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravathi  Seed capital  AP  chandrababu naidu  Singapur  Eeshwaran  Rajahmundry  

Other Articles