Godavari Pushkaralu | Boyapati seenu | Chandrababu naidu | Short film, Documentary, Rajahmundry, Kotilingala , Oushkarani Ghat

Director boyapati seenu gave clarification on the rajahmundry incident

Godavari Pushkaralu, Boyapati seenu, Chandrababu naidu, Short film, Documentary, Rajahmundry, Kotilingala , Oushkarani Ghat

Director Boyapati Seenu gave clarification on the Rajahmundry incident. He said that he didnt shoot any documentary or short film in at the Godavari Pushkaralu.

చంద్రబాబు అంతే చెప్పారంటున్న బోయపాటి

Posted: 07/20/2015 08:22 AM IST
Director boyapati seenu gave clarification on the rajahmundry incident

ఏపిలో గోదావరి మహా పుష్కరాల మొదటి రోజు తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒక్కసారిగా పుష్కరస్నానానికి రావడంతో తొక్కిసలాట జరిగి 27 మంది మృతి చెందడం జరిగింది. అయితే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు షార్ట్ ఫిలిం షూటింగ్ లో ఉన్నారని కాబట్టే దుర్ఘటన జరిగిందని విపక్షాలు మండినడుతున్నాయి. అయితే ప్రముఖ దర్శకుడు బోయపాటి శీను చంద్రబాబు నాయుడు షార్ట్ ఫిలింను షూట్ చేశారని విమర్శలు వస్తున్నాయి. అయితే దీని మీద బోయపాటి శీను స్పందించారు.

ఎట్టకేలకూ బోయపాటి వివరణిచ్చాడు.సిఎం చంద్రబాబు బోయపాటికి ఇచ్చిన డాక్యుమెంటరీ షూట్‌ చేయడం వల్లే ఈ సంఘటన జరిగిందని వస్తున్న వార్తలను ఖండించాడు. తనకి చంద్రబాబు హారతి గురించిన వర్క్‌ మాత్రమే అప్పగించారని తెలియజేశారు. తాను సినిమా దర్శకుడుని కాబట్టి రంగుల్ని ఎలా ప్రెజెంట్ చెయాలన్నది పూర్తి అవగాహన ఉందని. పుష్కర ఘాట్లో హారతి మరింత బ్రైట్ గా ఉండేలా చూడటం కోసం చంద్రబాబు నాయుడు గారు తనను పిలిచి ఆ భాధ్యత అప్పగించారని వివరించారు. దీని వల్ల దేశం నలు మూలల నుంచి వస్తున్న యాత్రికులు హారతి చూసి గొప్ప అనుభూతి పొందుతున్నారని అన్నారు.

తాను జూలై 12 న పుష్కర ఘాట్ కు వెళ్లానని,  పరిసరాల్ని గమనించే ఏం చేయాలో ఆలోచించానని బోయపాటి అన్నారు. అదికారుల సహకారంతో స్ధానికంగా ఉన్న దుకాణాలు నుంచి కావాల్సిన వస్తువుల కొననామని,  గుంటూరు నుంచి గొడుగులు తెప్పించాం హారతి అద్బుతంగా ఉండేలా తీర్చిదిద్దామని వివరణ ఇచ్చారు. ఈ ఏర్పాట్లు చూసి భక్తులు ఆనందించాలన్నదే మా ఉద్దేశ్యమని తెలిపారు.  చంద్రబాబు తనకు చెప్పింది  కూడా అదే అని వివరణ ఇచ్చుకున్నారు. 14వ తారీఖు డాక్యుమెంటరీ తీయటం లాంటిదేమీ జరగలేదని,  నిజానికి తనకు డాక్యుమెంటరీ తీసేంత టైం లేదని, హారతి బాగా వచ్చేలా చేయటం వరకే తన పని అన్నారు. జులై 13 రాత్రి తన పని పూర్తయ్యిందైని,  14న ఉదయం ఏడున్నరకు గౌతమి ఘాట్లో పుష్కర స్నానం చేసి హైదరబాద్ కు బయిలుదేరిపోయాను అని బోయపాటి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles