ysrcp mla roja compares chandrababu capital city with bahubali | magadheera | chandrababu naidu

Ysrcp mla roja compares chandrababu capital city with bahubali magadheera movies

mla roja, roja latest news, roja chandrababu naidu, roja hot photos, roja latest photo shoot, roja controversies, roja news, ap capital city, chandrababu naidu, naidu ap capital city, godavari pushkaralu, boyapati srinu, bahubali movie, bahubali collections, magadheera

ysrcp mla roja compares chandrababu capital city with bahubali magadheera movies : ysrcp mla roja compares chandrababu ap capital city with bahubali and magadheera movies.

‘బాహుబలి’లా.. చంద్రబాబు ‘రాజధాని’ సినిమా

Posted: 07/21/2015 12:22 PM IST
Ysrcp mla roja compares chandrababu capital city with bahubali magadheera movies

అదేంటి..? దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాహుబలి’ చిత్రానికి, ఏపీ ‘రాజధాని’కి పోలికేంటి..? అని ఆలోచిస్తున్నారా..! నిజానికి ఆ రెండింటికి ఏమాత్రం పోలిక లేదు కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ‘రాజధాని’పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఆ పోలికను తెరమీదకి తీసుకొచ్చారు. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ కు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన వీడియో తతంగాన్నంతా ఆమె ‘మగధీర’, ‘బాహుబలి’ చిత్రాలతో పోల్చారు. ఆ రెండు సినిమాల్లాగే సీఎం చంద్రబాబు రాజధాని సినిమా చూపిస్తున్నారని.. దాంతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుతోపాటు పుష్కరాల తొక్కిసలాట ఘటనలలోతన పాత్రను ప్రజలు మర్చిపోవాలనే ‘రాజధాని’ సినిమాను చంద్రబాబు చూపుతున్నారని రోజా ఆరోపణ చేశారు. పుష్కరాల్లో ప్రచారం కోసం సినిమా తీయించడానికి జనాన్ని పోగుచేసి తొక్కిసలాట జరగడానికి బాబే కారణమని ఆమె మండిపడ్డారు. ఆ సంఘటనను మర్చిపోవాలనే ఈ రాజధాని వీడియోలను పదేపదే చూపుతున్నారని ఆమె అన్నారు. ఆ ‘రాజధాని’ సినిమాతో ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. రాజధాని ప్రణాళికలో సామాన్యులకు, మధ్య తరగతి వారికి చోటెక్కడ కల్పించారో వెల్లడించాలని ఆమె ప్రశ్నలు సంధించారు. మరి.. రోజా కామెంట్లపై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

ఇదిలావుండగా.. రాజధాని మీద రోజా చేసిన పోలికపై కొన్ని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ‘బాహుబలి’ సినిమా షూటింగ్ మూడేళ్లపాటు ఎక్కువకాలం జరిగినా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే! అలాగే.. ఏపీ రాజధాని నిర్మాణం ఆలస్యం అయినా ప్రపంచవ్యాప్తంగా విశ్వనగరంగా పేరు సంపాదిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ అభిప్రాయాలపై రోజా ఏ విధంగా స్పందిస్తుందో..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mla roja  chandrababu naidu  ap capital city  bahubali  

Other Articles