parlaiment | Lalith Modi | NDA | Parliament sessions, Narendra modi, Rajya sabha, Speaker, Anand sharma

Opposition leaders demand to discuss about the lalith modigate in the parliament

parlaiment, Lalith Modi, NDA, Parliament sessions, Narendra modi, Rajya sabha, Speaker, Anand sharma

Opposition leaders demand to discuss about the Lalith modigate in the Parliament. In the Rajya Sabha, the Congress's Anand Sharma raised the Lalit Modi controversy, but when Leader of the House, Finance Minister Arun Jaitley, attempted to speak, he was shouted down by Opposition members, who outnumber those of the government in the Upper House.

లలిత్ మోదీ వ్యవహారంపై రాజ్యసహభలో రచ్చ

Posted: 07/21/2015 12:27 PM IST
Opposition leaders demand to discuss about the lalith modigate in the parliament

21 రోజుల పాటు సాగాల్సిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి ఉదయం ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలు సహకరించాలని కోరారు. అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రభుత్వం మీద దాడికి దిగారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం లలిత్ మోదీ వ్యవహారంలో ఎందుకు ఊరుకుంటోందని నిలదీశారు. ఐపిఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీని తిరిగి భారత్ కు రప్పించాలని... ఈ వ్యవహారంల మీద చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే పార్లమెంట్ పమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్షాలు ఇలా గందరగోళం సృష్టించడంపై స్పీకర్ మండిపడ్డారు. అధికార పక్షానికి చెందిన ఎంపీలు ఎంత చెబుతున్నా కానీ విపక్ష నేతలు తగ్గలేదు. దాంతో పార్లమెంట్ ను కాసేపు వాయిదా వేశారు స్పీకర్.

Also Read:  తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఏం చేస్తారో...!

విపక్షాలు చేస్తున్న గందరగోళం మీద వెంకయ్య నాయుడు మండిపడ్డారు. విపక్ష నేతలు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అయితే లలిత్ మోదీ వ్యవహారం మీద చర్చకు సిద్దమేనని మరి, విపక్షాలు కూడా అందుకు సిద్దంగా ఉన్నాయా అని అన్నారు. అయినా కూడా విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చే:శారు. ప్రభుత్వం చర్చకు సిద్దమని ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు ఆందోళనకు దిగుతున్నారని స్పీకర్ విపక్ష నేతలను ప్రశ్నించారు. ఎంతకీ విపక్ష నేతలు తగ్గకపోవడంతో అధికార పక్షం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడు విపక్షాల నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మొదటి రోజు అది కూడా మొదటి గంటలోనే ఇంత గందరగోళం చేస్తున్నారంటే ముందు ముందు పార్లమెంట్ సమావేశాలు ఎంత రసవత్తరంగా ఉంటాయో అని సర్వత్రా చర్చ సాగుతోంది.

By Abhinavachary

Also Read:  నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు.. దాడికి అన్ని పక్షాలు సిద్దం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parlaiment  Lalith Modi  NDA  Parliament sessions  Narendra modi  Rajya sabha  Speaker  Anand sharma  

Other Articles