Ap | Amaravathi | Capital city | Funds for amaravathi, Japan, Singapur

Do you know how ap govt collect funds for the amaravathi

Ap, Amaravathi, Capital city, Funds for amaravathi, Japan, Singapur

Do you know how ap govt collect funds for the amaravathi. The Ap govt moving to construct the capital city amaravathi by japan and singapur govt partnership.

అమరావతికి డబ్బులు ఎలా వస్తాయో తెలుసా..?

Posted: 07/22/2015 09:57 AM IST
Do you know how ap govt collect funds for the amaravathi

ఏపి రాజధాని నిర్మాణానికి అంతా సిద్దమైంది. సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ సిద్దంగా ఉంది. సింగపూర్ ప్రభుత్వం ఏపి రాజధానికి అన్ని రకాల సొగసులు అద్దుతూ మాస్టర్ ప్లాన్ ను అందించింది. అయితే ఓ చిన్న ఇల్లు కట్టడానికే నానాతంటాలు పడుతుంటాం. మరి అలాంటిది ప్రజా రాజధాని అమరావతిని కట్టాలంటే మామూలు విషయమా..? లక్షల కోట్లు కావాలి.... ఎంతో మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది. మరి మ్యాన్ పవర్ అయితే ఉంది కానీ డబ్బులే లేవు. ఎందుకంటే ఏపి ప్రభుత్వం ఇప్పటికే లోటును ఎదుర్కొంటోంది. ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది ఏపి ప్రభుత్వం. అప్పుల మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నాము బాబు... కాబట్టి మాకు డబ్బులివ్వండి అంటూ  కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది ఏపి ప్రభుత్వం. మరి ఇలాంటి పరిస్థితిలో ఏపి అంత భారీ రాజధాని నిర్మాణాన్ని ఎలా చేపడుతుంది..? ఎక్కడి నుండి వస్తాయి.. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కింది ఆర్టికల్ లో సమాధాలు లభిస్తాయి.

Also Read:  సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ సూపర్.. అంతా మంచే అంటున్న బాబు
Also Read:  అమరావతి సీడ్ కేపిటల్ ప్లాన్ ఇదే

నిధులు సాధిస్తారు ఇలా..
* ఏపి ప్రభుత్వం  ఒక కంపెనీని త్వరలో ఏర్పాటు చేస్తుంది.
*ఈ కంపెనీలో ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌, జపాన్‌ ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉంటాయి.
* సింగపూర్‌, జపాన్‌లలో ఒక దేశానికి 50 శాతం ఉంటుందని చెబుతున్నారు.
* ఏపీకి 25 శాతం వాటా ఉంటుందనే అంచనా ఉంది.
* ఏపీ ప్రభుత్వం నేరుగా ఈ కంపెనీలో నగదు రూపంలో పెట్టుబడి పెట్టకుండా రాజధాని ప్రాంతంలోని భూములను చూపించనుంది. ఈ భూముల విలువను లెక్కించి దానిని ఏపీ వాటాగా నిర్ణయిస్తారు.
* మిగిలిన ప్రభుత్వాలు తమ వాటాగా నిధులు సమకూర్చాల్సి ఉంటుంది.
* రాజధాని నిర్మాణానికి ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు చేస్తారు. దీని ఆధ్వర్యంలో నిర్మాణ కార్యక్రమం నడుస్తుంది.
* ఏపి రాజధాని అమరావతిలో జపాన్ పెట్టుబడులు పెడుతున్న చోట జరిగే కొనుగోళ్లలో 65 శాతం మెటీరియల్ ను జపాన్‌ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని కండీషన్ పెట్టింది. మిగిలిన 35 శాతం కొనుగోళ్లను స్థానికంగా చేసుకోవచ్చు.

Also Read: అదిరిపోయేలా.. అపూర్వంగా అమరావతి నిర్మాణం

అదిరిపోయేలా.. అపూర్వంగా అమరావతి నిర్మాణం: బాబు

Also Read:  ‘బాహుబలి’లా.. చంద్రబాబు ‘రాజధాని’ సినిమా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Amaravathi  Capital city  Funds for amaravathi  Japan  Singapur  

Other Articles