బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో అక్కడి వాతావరణం వాడీవేడీగా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపొందడం కోసం రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్కడి ప్రజలను తనవైపుకు ఆకర్షించుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యనేతలపై పరోక్షంగా విమర్శలు మొదలుపెట్టేశారు. ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ ని టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్లదాడికి దిగారు. అటు తన మాటలతో అందరినీ ఉత్తేజపరిచే ప్రధాని నరేంద్రమోడీ కూడా తన ‘మాటలమంత్రాన్ని’ అక్కడి జనాలపై ప్రయోగిస్తున్నారు.
ఓ సందర్భంలో మోడీ తన ప్రసంగంలో ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆ రాష్ట్రంలోని యాదవులను ఆకట్టుకునేందుకు తాను శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టిన గడ్డకు చెందిన వాడినని మోడీ పేర్కొన్నారు. ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించడంపై తీవ్ర ఆగ్రహానికి గురైన బీహార్ మాజీముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్.. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.మోడీ చేసిన ఆ వ్యాఖ్యకు కౌంటర్ ఇస్తూ ‘మోడీ ఓ కాలనాగు.. దాన్ని నలిపేస్తా’ అంటూ లాలూ ధ్వజమెత్తారు. ‘కాలనాగు పామును శ్రీకృష్ణుడు తన చిన్నతనంలోనే మట్టుబెట్టేశాడు. అయితే.. ఆ కాలనాగు ఇప్పుడు మోడీ రూపంలో పుట్టింది. అది బీహార్ మొత్తాన్ని కాటేయాలని చూస్తోంది. మన యాదవుల్ని అంతమొందించాలని కుట్రపన్నుతోంది. కానీ.. మనం అలా జరగనివ్వకుండా చేయాలి. ఆ బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పీకేయాలి’ అంటూ లాలూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇక తనకు, నితీష్ కుమార్ కి మధ్య ఎటువంటి విభేదాలు లేవని పేర్కొన్న ఆయన.. తమ మధ్య బేధాలు వున్నట్లు బీజేపీ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సీట్ల పంపకం విషయంలో నితీష్, లాలూ మధ్య గతకొన్నాళ్ల నుంచి గొడవ జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. లాలూ తనకు ఎక్కువ సీట్లు కేటాయించాల్సిందిగా డిమాండ్ చేస్తుండగా.. నితీష్ అందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. దీంతో వీరిమధ్య వైరుధ్యం పెరుగుతోందని వార్తలు రావడం మొదలయ్యాయి. ఈ విషయాన్ని పసిగట్టిన బీజేపీ.. వారిమధ్య విబేధాలున్నట్లు ప్రచారం జరుపుతోందని సమాచారం. ఇంకొక విశేషం ఏమిటంటే.. ఇటీవలే బీహార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో బద్ధశత్రువులైన మోడీ, నితీష్ ఒకే వేదికపై కనువిందు చేసిన విషయం తెలిసిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more