సోమవారం ఉదయం పంజాబ్ లోని దీవానగర్ పోలీస్ స్టేషన్ పై ‘ముంబై 26/11’ తరహాలో విరుకుపడ్డ ఉగ్రవాదులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎటాక్ ఎలా చేశారు? అన్న విషయంపై ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఆరాతీయగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఆ ముష్కరులు పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులేనని.. పాక్ లోని నరోవాల్ బార్డర్ నుంచి వాళ్లు వచ్చారని బ్యూరో వర్గాలు భావిస్తున్నాయి. దీవానగర్ లోకి ఇండియన్ ఆర్మీ కీలక స్థావరాలను కూల్చేసే ప్లాన్ లో భాగంగానే వారు ఈ దాడికి దిగినట్లు తెలుస్తోందని వారు అనుకుంటున్నట్లు సమాచారం.
ఆ ముష్కరులు పంజాబ్ లోని పోలీస్ స్టేషన్ పై దాడి చేయకుముందే వారి కదలికలు ముందుగానే కనిపించినట్లుగా బ్యూరో వెల్లడించింది. ఈ దాడికి ముందే వారి కదలికలను జమ్ములోని హరినగర్ లో గుర్తించినట్లు సమాచారం. అక్కడినుంచి అమృత్ సర్-పఠాన్ కోట్ హైవే వద్దకు రాత్రి సమయంలో చేరుకున్నారు. అక్కడ తొలుత వారు తెల్లని మారుతీ కారును హైజాక్ చేశారు. అనంతరం అదే రహదారిపై వెళుతున్న ఓ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ ప్రయాణికుడు మరణించాడు. ఇక అక్కడినుంచి ఆ ఉగ్రవాదులు నేరుగా దీవానగర్ చేరుకుని అక్కడి పోలీస్ స్టేషన్ పై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ముందుగా స్టేషన్ బయట వున్న ఓ గార్డును చంపేసి.. అనంతరం పీఎస్ లో కి అడుగుపెట్టారు. ఆ తర్వాత స్టేషన్ లోని పోలీసులను, లాకప్ లో వున్న ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపేసి.. ఆ పోలీస్ స్టేషన్ ను తమ అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగాయి కానీ.. పూర్తి ప్లానింగ్ తో వచ్చిన ఆ ఉగ్రవాదులు వారిని హతమార్చి స్టేషన్ ను తమ అధీనంలోకి తీసుకున్నారు. ముందుగా ఆర్మీ దుస్తుల్లో నలుగురు ఉగ్రవాదులు ఎంట్రీ ఇవ్వగా.. క్రమంగా వారి సంఖ్య 10 వరకు చేరిందని తెలుస్తోంది.
ముష్కరుల చేసిన ఈ దాడిని తెలుసుకున్న పంజాబ్ పోలీసులు భారీ సైన్యంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ఉగ్రవాదులు, సైన్యం మధ్య కాల్పులు జరుగుతున్నాయి. సైన్యం జరిపిన కాల్పుల్లో ఇప్పటికే ఒక ఉగ్రవాది మరణించినట్లు సమాచారం. అటు ఉగ్రవాదులు ప్లానింగ్ ప్రకారం.. ప్రతి 5 నిముషాలకోసారి దాడికి దిగుతున్నారని, ఈ దాడికి పాల్పడ్డవారంతా మంచి ట్రైనింగ్ తీసుకున్నవారని భద్రతా దళాలు తెలిపాయి. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే వుంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more