యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘బాహుబలి’ చిత్రం అఖండ విజయం సాధించింది. ఏ దక్షిణాది సినిమా క్రియేట్ చేయలేని సరికొత్త రికార్డులను ఈ చిత్రం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ఇంత భారీ రేంజులో విజయం సాధించిన నేపథ్యంలో.. ప్రభాస్ దేశంలోని అగ్రనేతలతో మంతనాలు జరిపి, వారిని తన సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాడు. ఇప్పటికే తన పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి ఢిల్లీలో బిజీగా వున్న ప్రభాస్.. ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్రనేత అద్వానీ, కేంద్రమంత్రులు అద్వానీ, అరుణ్ జైట్లీలను కలిశాడు. ఈ చిత్రాన్ని చూసిన రాజ్ నాథ్, అరుణ్ జైట్లీలు ప్రభాస్ కు అభినందనలు తెలుపారు. కొందరు నాయకులు ఈ సినిమాలో ప్రభాస్ నటన గురించి చెప్పగా.. తాను కడూడా తప్పకుండా చూస్తానని మోదీ చెప్పారు.
ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినీ ఇమేజ్ ఏంటో ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతల వరకు పాకింది. ఈ విషయాన్ని పసిగట్టిన వారు.. తమ పార్టీ స్వలాభాల కోసం ఆ హీరోని ఉపయోగించుకోవాలని భావిస్తోందట. అంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రభాస్ చేత ప్రచారం చేయించుకోవాలనే యోచనలో వుందని వార్తలొస్తున్నాయి. అటు.. ప్రభాస్, కృష్ణంరాజులు కూడా బీజేపీ అగ్రనేతలను కలుస్తుండటాన్ని చూస్తుంటే.. ఆ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు.. బీజేపీలో తన పెదనాన్న కృష్ణంరాజు ప్రాభవం పరిగేందుకు ప్రభాస్ ఉపయోగపడతాడని అంటున్నారు. అంటే.. బీజేపీ తరఫున ప్రభాస్ మద్దతు చేస్తే.. కృష్ణంరాజు ఇమేజ్ ఆ పార్టీలో మరింత పెరుగుతుందని అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఈ విషయంలో ఎంతమాత్రం వాస్తవం వుందోలేదో తెలియదు కానీ.. ప్రభాస్ వరుసబెట్టి బీజేపీ నేతల్ని కలుస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.
ఇదిలావుండగా.. బీజేపీ పార్టీకి జనసేనాధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా మద్దతుగా వున్న విషయం తెలిసిందే! అయితే.. ప్రస్తుతం పవన్ తన పార్టీ మీదే ఎక్కువ దృష్టి పెట్టాడని, వచ్చే ఎన్నికల్లో అతడు బరిలోకి దిగే సూచనలు వున్నాయని తెలుస్తోంది. దీంతో పవన్ బీజేపీకి దూరం అవుతాడు కాబట్టి.. అతనికి చెక్ పెట్టేందుకు ప్రభాస్ కొంతమేరైనా ఉపయోగపడతాడని ఆ పార్టీ భావిస్తోందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే విషయమై సినీ, రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. మరి.. ప్రభాస్ నిజంగానే బీజేపీకి మద్దతుగా వచ్చే ఎన్నికల్లో నిలుస్తాడో లేదో తెలియాలంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more