The Punjab Terror Attack In Gurdaspur Deevanagar Is Over | Gurdaspur Gunbattle

Punjab terror attack over all terrorists killed gurdaspur

punjab terror attack, gurdaspur gunbattle, terrorists in pujab, punjab latest news, terrorists killed in gunbattle, terror attack in punjab, jammu kashmir news

Punjab Terror Attack Over All Terrorists Killed Gurdaspur : The 12-hour-long Gurdaspur gunbattle has ended with security forces gunning down all the terrorists.

ముగిసిన ‘పంజాబ్ టెర్రర్ ఎటాక్’.. తీవ్రవాదులు హతం

Posted: 07/27/2015 06:51 PM IST
Punjab terror attack over all terrorists killed gurdaspur

పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా దీవానగర్ ప్రాంతంలో ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున మొదలైన ఎన్ కౌంటర్ సాయంత్రం 5.10 నిముషాలకు ముగిసింది. దీవానగర్ లోకి చొరబడిన నలుగురు తీవ్రవాదులు.. పోలీసులతోపాటు పలువురు సామాన్యులను పొట్టన పెట్టుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన భ్రదతాదళాలు ఆ ఉగ్రవాదులపై తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. దాదాపు పదిగంటలపాటు జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో భ్రదతాదళాలు ఆ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేశాయి. ఈ ఎన్ కౌంటర్ లో పంజాబ్ పోలీస్ కమాండోలు, ఎన్.ఎస్.జీ. బలగాలు, కేంద్రం పంపిన ప్రత్యేక బలగాలు కూడా పాల్గొన్నాయి. అయితే.. ఈ ఉగ్రవాదుల దాడిలో ఎస్పీ బల్జీత్ సింగ్ సహా 13 మంది చనిపోయారు. ఈ దాడికి పాల్పడింది లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులని అనుమానిస్తున్నారు.

ఇదిలావుండగా.. ఆ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడకముందే వారి కదలికలను జమ్ములోని హరినగర్ లో గుర్తించినట్లు భ్రదతాదళాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆర్మీ దుస్తుల్లో వున్న ఆ నలుగురు ఉగ్రవాదులు అక్కడినుంచి అమృత్ సర్-పఠాన్ కోట్ హైవే వద్దకు రాత్రి సమయంలో చేరుకున్నారు. అక్కడ తొలుత వారు తెల్లని మారుతీ కారును హైజాక్ చేశారు. అనంతరం అదే రహదారిపై వెళుతున్న ఓ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ ప్రయాణికుడు మరణించాడు. ఇక అక్కడినుంచి ఆ ఉగ్రవాదులు నేరుగా దీవానగర్ చేరుకుని అక్కడి పోలీస్ స్టేషన్ పై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ముందుగా స్టేషన్ బయట వున్న ఓ గార్డును చంపేసి.. అనంతరం పీఎస్ లో కి అడుగుపెట్టారు. ఆ తర్వాత స్టేషన్ లోని పోలీసులను, లాకప్ లో వున్న ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపేసి.. ఆ పోలీస్ స్టేషన్ ను తమ అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న భద్రతాదళాలు వారిపై ఎదురు కాల్పులు జరిపి చివరికి వారిని హతమార్చేశారు.

ఇదిలావుండగా.. ముంబై దాడుల్లో 4993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ మెమన్ భవితవ్యంపై తీర్పు వెలడనున్న సందర్భంలోనే ఆ ఉగ్రవాదులు దాడులు చేయడం గమనార్హం. పైగా.. ఇండియన్ ఆర్మీ కీలక స్థావరాలు కూడా దీవానగర్ లోనే వున్నాయి. వాటిని కూల్చేసే ప్లాన్ లో భాగంగానే ఈ దాడికి దిగనట్లు తెలుస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉగ్రదాడితో కేంద్రం అలర్ట్ అయ్యింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : punjab terror attack  punjab police  gurdaspur gunbattle  

Other Articles