మాజీ రాష్ట్రపతి, భారత రత్న అబ్దుల్ కలాం కన్ను మూశారు. షిల్లాంగ్ లోని ఐఐఎంలో జరిగిన ఓ సెమినార్ లో ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకులారు. షిల్లాంగ్ లోని బెథని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 6. 30 గంటలకు కన్ను మూశారు. తమిళనాడు రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15న కలాం జన్మించారు. పేపర్ బాయ్ నుండి రాష్ట్ర పతి స్థాయికి ఎదిగిన కలాం భారత 11వ రాష్ట్రపతిగా 2002-2007 మధ్య కాలంలో పని చేశారు. ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకొన్నారు. వింగ్స్ అఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని రచించారు. పోఖ్రాన్ అణు పరిక్షలో కీలక పాత్ర వహించారు. విదేశీ వర్సిటీల నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. కలాం మృతి పట్ల రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ , ప్రధాని మోదీ తో పాటు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్,పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్,ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్, షార్ అధికారులు, జేపి,జగన్.. పలువురు సీనీ ప్రముఖులతో పాటు పలువురు సంతాపం తెలిపారు.
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇకలేరు. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే ఆయన పూర్తిపేరు అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడులోని రామేశ్వరంలో అక్టోబర్ 15, 1931లో జన్మించారు. ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త , పదకొండో భారత రాష్ట్రపతి అయిన కలాం తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.
అబ్దుల్ కలాం చివరి ట్వీట్ ఇదే.. బహుశా ఇదే ఆయన చివరి సందేశం అనుకోవలేమో..
కలాం అందుకున్న పురస్కారాలు...
1981 - పద్మ భూషణ్
1990 - పద్మ విభూషణ్
1994 - గౌరవ ఫెలో- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్
1997 - భారతరత్న
1997 - నేషనల్ ఇంటిగ్రేషన్ ఇందిరా మహాత్మా గాంధీ పురస్కారం
1998 - వీర్ సావర్కర్ అవార్డు
2000 - రామానుజన్ అవార్డ్ - ఆళ్వార్ రీసెర్చ్ సెంటర్, చెన్నై
2007 - కింగ్ చార్లెస్ II పతకం - రాయల్ సొసైటీ, యుకె
2007 - సైన్సు రంగంలో గౌరవ డాక్టరేట్ - వోల్వర్‌థాంప్టన్ విశ్వవిద్యాలయం, యుకె
2008 - ఇంజనీరింగ్ డాక్టర్ - నాణ్యంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, సింగపూర్
2009 - గౌరవ డాక్టరేట్ - ఓక్లాండ్ యూనివర్శిటీ
2009 - హూవర్ పతకం - ASME ఫౌండేషన్, అమెరికా
2009 - ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు - కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా
2010 - ఇంజనీరింగ్ డాక్టర్- వాటర్లూ విశ్వవిద్యాలయం
2011 - IEEE గౌరవ సభ్యత్వం
2012 - గౌరవ డాక్టరేట్ - సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం
2014 - సైన్స్ డాక్టరేట్ - ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం
రచనలు...
* ఇండియా 2020 - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, వై.ఎస్.రాజన్ (పెంగ్విన్ బుక్స్ ఆఫ్ ఇండియా, 2003)
* ఇగ్నైటెడ్ మైండ్స్: అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా by ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (పెంగ్విన్ బుక్స్, 2003)
* ఇండియా-మై-డ్రీం - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (ఎక్సెల్ బుక్స్, 2004)
* ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్ : టెక్నాలజీ ఫర్ సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (టాటా మెక్‌గ్రా-హిల్ పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్, 2004)
జీవిత చరిత్రలు..
*వింగ్స్ ఆఫ్ ఫైర్: ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అరుణ్ తివారీ (ఓరియంట్ లాంగ్మన్, 1999)
*సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (గ్యాన్ పబ్లిషింగ్ హౌస్, 2003)
*ఎటర్నల్ క్వెస్ట్: లైఫ్ అండ్ టైంస్ ఆఫ్ డా. అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం - ఎస్.చంద్ర (పెంటగాన్ పబ్లిషర్స్, 2002)
*ప్రెసిడెంట్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - ఆర్.కె.ప్రుథి (అన్మోల్ పబ్లికేషన్స్, 2002)
*ఏ.పి.జె.అబ్దుల్ కలామ్: ది విజనరీ ఆఫ్ ఇండియా' - కె.భూషన్, జీ.కట్యాల్ (ఏ.పీ.హెచ్.పబ్లిషింగ్ కార్పోరేషన్, 2002)
(Source: Andhrajyothy)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more