vakulamatha temple and thousand pillar mantapam to be re built in Tirumala

Ttd governing council took key decisions

TTD Governing Council took Key decisions, oontimitta ramalayam, vakulamatha temple and thousand pillar mantapam to be re built in Tirumala, vijayawada, rajamundry sri vari temples, big hanumam idol, TTD, chairman chadalavada krishna murthy, TTD governing council, vakulamatha temple, thousand pillar mantapam, Tirumala

TTD Governing Council headed by chairman chadalavada krishna murthy took Key decisions in meeting supposed to rebuild vakulamatha temple and thousand pillar mantapam in Tirumala

కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ.. వకుళమాత ఆలయం పునర్నిర్మాణం

Posted: 07/28/2015 10:36 PM IST
Ttd governing council took key decisions

టీటీడీ పాలకమండలి సమావేశాలు ముగిశాయి. మంగళవారం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశమయింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నారాయణగిరి ఉద్యానవనంలో వెయ్యికాళ్ల మండపం పునర్నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇందుకు గానూ టీటీడీ చైర్మన్‌ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటయింది. పేరూరులో వకుళమాత ఆలయాన్ని పునర్నిర్మిస్తామని కమిటీ తెలియజేసింది. ఒంటిమిట్ట రామాలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు, భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రాజమండ్రి, విజయవాడలో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టాలని కమిటీ నిర్ణయించిది. టీటీడీ వినియోగించే సోనామసూరి బియ్యంను రూ. 35కు కొనుగోలు, టీటీడీ ఉద్యోగుల యాత్రికుల పరిహార భత్యాన్ని 1500 నుంచి 2500కు పెంపు, సురాపురం తోట గదుల అద్దెను 750 నుంచి 1500 పెంపు, గోవిందరాజుల ఆలయం అభివృద్ధికి రూ. 59లక్షల కేటాయింపు నిర్ణయాలకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. అలాగే, రూ. 72 కోట్లతో నూతనంగా వసతి సముదాయాలు ఏర్పాటు, 50 కోట్లతో కొనుగోళ్లకు ఆమోదం, రూ. 10 కోట్లతో తిరుపతిలోని 2వ, 3వ సత్రాల ఆధునీకరణ వంటి కీలకమైన వాటికి పాలక మండలి పచ్చ జెండా ఊపింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTD  chairman chadalavada krishna murthy  TTD governing council  Tirumala  

Other Articles