Heartbroken Rameswaram waits at APJ Abdul Kalam’s Home

Jayalalithaa to skip apj abdul kalam s funeral deputes 7 colleagues

Public Tribute to Former President APJ Abdul Kalam At His Residence in Delhi, President, PM, Vice President pay homage to kalam, APJ Abdul Kalam, Abdul Kalam, Abdul Kalam Shillong, Abdul Kalam ICU, Abdul Kalam hospital, Abdul Kalam Dies, PM Modi tributes to modi, Narendra modi, Final journey, Pranab Mukharjee, Hameed Ansari, Abdul Kalam dies, former president dies, Rahul gandhi pays tribute to abdul kalam, 10 Rajaji Marg, palam airport, Madhurai, jayalalithaa, tamilnadu, final rites, rameswaram, barrack obama, barack obama, manohar parrikar, Venkaiah naidu, potus, prime minister narendra modi, people's president

Rameswaram, the birth place of people’s president, APJ Abdul Kalam, waits for the mortal remains of the great leader who inspired billion hearts.

మధురైకి కలాం పార్ధివదేహం.. అంత్యక్రియలకు జయ దూరం..

Posted: 07/29/2015 02:01 PM IST
Jayalalithaa to skip apj abdul kalam s funeral deputes 7 colleagues

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పార్థివదేహాన్ని ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో మధురైకి తరలించారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, పారికర్‌ తదితరులు పార్థివదేహం వెంట ఉన్నారు. మధురైలో కలాం పార్థివదేహానికి తమిళనాడు గవర్నర్‌ రోశయ్య నివాళులర్పించనున్నారు. ఆ తరువాత ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మండపానికి ఆ తరువాత రామేశ్వరానికి తరలిస్తారు. మొదట కలాం భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తీసుకువెళ్తారు. ఆ తరువాత మజీదుకు తీసుకువెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనల తర్వాత మండపంలోని మైదానానికి తీసుకెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ప్రజల సందర్శనార్ధం అక్కడే ఉంచుతారు. గురువారం ఉదయం 11 గంటలకు కలాం అంత్యక్రియలు జరుగనున్నాయి.

అబ్దుల్ కలాం అంత్యక్రియలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరకానున్న తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాత్రం అంతిమ సంస్కారాలకు హాజరు కావడంలేదు. అనారోగ్యం కారణంగా తాను హాజరుకాలేక పోతున్నట్లు ఆమె తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం తరపున పన్నీర్‌ సెల్వం సహా ఏడుగురు సీనియర్ మంత్రులందరూ కలాం అంత్యక్రియలకు హాజరవుతారని జయ వెల్లడించారు. డాక్టర్ అబ్దుల్ కలాంతో సత్సంబంధాలున్న జయలలిత, ఆయన్ని రాష్ట్రపతి పదవిలో రెండవసారి చూడాలని ఎంతో కోరుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APJ Abdul Kalam  Madhurai  jayalalithaa  tamilnadu  final rites  Rameshwaram  

Other Articles