High alert throught out the nation after Yakub Memon's hanged

Delhi and mumbai put on high alert after yakub memon s hanging

Delhi and Mumbai put on high alert after Yakub Memon's hanging, High alert throught out the nation after Yakub Memon's hanged, India, high alert, minority-dominated areas, Yakub Memon, hanged in Nagpur jail, to be buried in Mumbai, Yakub Memon, YakubMemonHanged, Yakub Memon hanged, yakub memon death sentence, Yakub Memon mercy plea, Supreme Court, Nagpur Jail, Yakub hanged, 1993 Bombay blasts, 1993 blasts,1993 blasts case, Bombay Bomb Blasts, Tiger Memon, Dawood Ibrahim, Mumbai Serail Blast Case, Supreme Court, TADA court

A high alert has been sounded across India following the execution of 1993 Mumbai blasts accused Yakub Memon, officials said. A special vigil is being kept on the Indo-Nepal border and minority-dominated areas

ఢిల్లీ, ముంబై సహా దేశవ్యాప్తంగా హైఅలర్ట్.. ప్రధాన మార్గాల్లో చెక్ ఫోస్టులు

Posted: 07/30/2015 05:02 PM IST
Delhi and mumbai put on high alert after yakub memon s hanging

1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషియైన యాకూబ్‌ మెమెన్‌ను ఉరి తీసిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. నాగ్‌పూర్‌, ముంబై, ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. జనసాంధ్రత అధికంగా వున్న ప్రాంతాలతో పాటు.. ముస్లిం మైనారిటీలు అధికంగా వున్న ప్రాంతాల్లోనూ గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. మెమెన్ ఉరి నేపథ్యంలో దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్‌ హెచ్చరికలే ఇందుకు ప్రధాన కారణం. ముంబై పేలుళ్ల సూత్రధారి ఒకరైన యాకూబ్‌ మెమెన్‌ను గురువారం ఉదయం ఉరి తీసిన దృష్ట్యా దేశంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉరి శిక్షకు ప్రతికారంగా ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చునని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఢిల్లీలో భద్రతను పెంచారు.

ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నాగ్‌పూర్‌లో 144 సెక్షన్‌ విధించారు. జైలు చుట్టుపక్కలకు ఎవరినీ రానీయలేదు. రద్దీ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ముంబైలోనూ భద్రత పెంచారు. కీలక ప్రాంతాలలో తనికీలు నిర్వహించారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. చొరబాట్లు జరగకుండా భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. పంజాబ్‌లోనూ దాడులు జరిగే అవకాశం ఉందని ఆర్మీ ఇంటిలిజెన్స్‌ వెల్లడించింది.

ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతంలోనూ అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గురుదాస్ పూర్ లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మరోమారు ఉగ్రవాదులు ఈ తరహా దాడులకు పాల్పడవచ్చునన్న అనుమానంతో పోలీసులు వాహనాల తనిఖీలను కూడా చేస్తున్నారు. అటు ఉత్తర్ ప్రదేశ్ లోనూ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా సముద్ర మార్గాలు వున్న రాష్ట్రాల్లో కూడా తీరప్రాంతాల్లో గస్తీని ఏర్పాటు చేశారు. అటు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల సహా ప్రధాన కూడళ్ల వద్ద కూడా పోలీసులు పహారా కాస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 1993 mumbai blasts  yakub memon  India  high alert  minority-dominated areas  

Other Articles