TDP | TeluguDesamParty | Chandrababu

Telugudesamparty president decided to shift his party to viajayawada

TDP, TeluguDesamParty, Chandrababu, Hyderabad, Vijayawada, Guntur, AP, Telangana

TeluguDesamParty President decided to shift his party to Viajayawada. The AP cm Chandrababu cant consontrate on Party so that he decided to shift the party office to Viajayawada.

ఇక టిడిపి విజయవాడ నుండే పనిచేస్తుంది.!

Posted: 07/31/2015 08:19 AM IST
Telugudesamparty president decided to shift his party to viajayawada

తెలుగుదేశం పార్టీ తమ కార్యకలాపాలను విజయవాడ నుంచే నిర్వహించాలని నిర్ణయించుకున్నటట్టు తెలిసింది. ఈ మేరకు ముఖ్య నాయకుల సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలను పార్టీ గుంటూరు కార్యాలయం నుంచి నిర్వహించనున్నారు. పార్టీ కార్యకలాపాల ఛైర్మన్‌ లోకేష్‌ ఇందుకోసం అక్కడి పిచ్చుకలగుంటలోని పార్టీ కార్యాలయాన్ని ఇటీవల పరిశీలించి వెళ్లారు. విజయవాడలో ప్రధాన కార్యాలయం కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నారు. మంగళగిరి సమీపంలో పార్టీ కార్యాలయానికి స్థలం కొనుగోలు చేయాలని నిర్ణయించినా ప్రభుత్వం నుంచి స్థలాల కేటాయింపు ఉంటుందని, అప్పటి వరకూ ఆగాలని నిర్ణయించారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయ మూ సిద్ధమైంది. ఇక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలూ ఉంటే ప్రజలకు మరింత చేరువకావచ్చనేది చంద్రబాబు నిర్ణయం.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. అక్కడే నూతనంగా ఇల్లూ నిర్మించుకున్నారు. ఆయన విజయవాడకొస్తున్న ప్రతిసారీ మంత్రులు పెద్దఎత్తున స్వాగతాలు పలుకుతుండటంతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండటం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడి, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, వెంటనే విజయవాడ నుంచే కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం. స్వాగతాలు పలకొద్దని గతంలోనే ఆయన ప్రజాప్రతినిధులకు సూచించారు తెలంగాణ ప్రభుత్వం నుంచి సానుకూలత లేకపోవడంతో అక్కడ ఉండటం కష్టమనే ఉద్దేశం మంత్రుల్లోనూ వ్యక్తమైనట్లు తెలిసింది. ఈనేపథ్యంలో తొలివిడతగా గుంటూరు నుంచి ట్రస్ట్‌ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

మరోవైపు 13 జిల్లాల పార్టీ కార్యక్రమాలు, మినీ మహానాడు, ముఖ్య కార్యకర్తలతో సమీక్ష, ఎమ్మెల్యేలు, ఎంపీిల సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తున్నారు. రేపు మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటుకానుంది. ఇక నుంచి పార్టీ కార్యక్రమాలన్నీ విజయవాడ కేంద్రంగా నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. కొద్దిమంది మంత్రులూ విజయవాడ నుంచేే పాలన సాగిస్తున్నారు. హైదరాబాద్‌ వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అత్యవసరమైన ఫైళ్లపై సంతకాలు చేయాల్సొచ్చినప్పుడే వెళుతున్నారు. పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ మంగళగిరి సమీపంలోని హారుల్యాండ్‌లో ఉంటున్నారు. రాజధాని నిర్మాణ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షణ చేయాల్సుం టుందని, ఇక్కడే ఉంటే ఆ పని సులువు అవుతుందనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారనీ, దీనిలో భాగంగానే పార్టీ కార్యక్రమాలూ ఇక్కడి నుంచేే సాగిస్తామనీ మంత్రులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  TeluguDesamParty  Chandrababu  Hyderabad  Vijayawada  Guntur  AP  Telangana  

Other Articles