Heavy Rains | Rains | Floods | Rains In India | Nepal

Heavy rains in nepal and india

Heavy Rains, Rains, Floods, Rains In India, Nepal

Heavy rains in Nepal and India. In India Gujarat, Uttarpradesh, Rajasthan, West Bengal are suffering from the Heavy rains.

భారీ వర్షాలు.. అతాలాకుతమవుతున్న జనాలు

Posted: 07/31/2015 08:22 AM IST
Heavy rains in nepal and india

నేపాల్‌ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి వేర్వేరు ప్రాంతాల్లో 13మంది మహిళలతో సహా 25 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. ఖాట్మాండుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాశీ జిల్లాలోనే 19మంది మరణించినట్లు సమాచారం. ప్రసిద్ధ పర్యాటక ప్రాంత పోఖరా వరద తాకిడికి గురైందని హోంశాఖ అధికారులు తెలిపారు. లంపెల్‌లో 14మంది కనిపించకుండా పోయినట్లు అధికారులు వివరిస్తున్నారు. భాదారి గ్రామం లో కొండ చరియలు విరిగిపడి ఇద్దరు మహిళ లతో సహా ఐదుగురు చనిపోయారు. వరదల కారణంగా పోఖారా-బాగ్‌లుగ్‌ రహదారి కూడా దెబ్బతింది. నేపాల్‌ ఆర్మీ, పోలీస్‌ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటు న్నారు. గల్లంతైన వారిని వెతికేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వారు వివరించారు. కాని వరదల కారణంగా పలు వంతెనలు కూలీపోవడం వలన సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు తెలిపారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఉత్తర భారత దేశంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గంగా , యమునా, సబర్మతి నదుల ఉగ్రరూపం దాల్చడంతో గుజరాత్, యూపీ , రాజస్తాన్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వరదలో చిక్కుకున్నాయి . ఒక్క గుజరాత్ రాష్ట్రం లోనే అమ్రేలి జిల్లాలో 27 మంది చనిపోగా 70మందికి పైగా వరదలో చిక్కుకుపోయారు. గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలలో విద్యుత్ నిలిచిపోయింది. యూపీ, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలూ నీట మూనిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Heavy Rains  Rains  Floods  Rains In India  Nepal  

Other Articles