Telangana Education Department Appreciated By The Ministry of Human Resource For Completing Govt Schools Toilet

The ministry of human resource appreciated telangana education department govt schools toilet

ministry of human resource, telangana education department, telangana govt schools, govt schools toilet, central govt, toilets in telangana, andhra pradesh govt

The Ministry of Human Resource Appreciated Telangana Education Department Govt Schools Toilet : Telangana Education Department Appreciated By The Ministry of Human Resource For Completing Govt Schools Toilet Before Deadline

పొగడ్తల వర్షంలో మునిగితేలుతున్న ‘తెలంగాణ’

Posted: 08/01/2015 05:25 PM IST
The ministry of human resource appreciated telangana education department govt schools toilet

రెండు తెలుగురాష్ట్రాల మధ్య నడుస్తున్న వాడీవేడీ రాజకీయ వాతావరణాన్ని కాస్త పక్కన పెడితే.. ప్రస్తుతం తెలంగాణ ఓ విషయంలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుండటంతో ఆ రాష్ట్రానికి పొగడ్తలు వచ్చిపడుతున్నాయి. కేంద్రం విధించిన నిర్ణీత గడువు (ఆగస్టు 15)కు ముందే ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాలను పూర్తి చేసి ఆ రాష్ట్రం భేష్ అనిపించుకుంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమీక్షలో తెలంగాణ విద్యాశాఖకు ప్రశంసలు తెలియచేసింది.

గడిచిన మూడు నెలల్లో 14,526 మరుగుదొడ్లను నిర్మించి సరికొత్త రికార్డు సృష్టించింది. అలాగే ప్రభుత్వ రంగసంస్థలు నిర్మిస్తున్న మరో 267 టాయిలెట్లు త్వరలోనే పూర్తిచేసేలా చర్యలు చేపట్టింది. మొత్తంగా 36,224 మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టగా శుక్రవారం నాటికి 35,957 వినియోగంలోకి తెచ్చింది. అంతేకాదు.. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో 3,079 పాఠశాలల్లో చేపట్టిన బోర్లు వేయడం, పైపులైన్ల నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. ఇలా ఈ విధంగా నిర్ణీత గడువులోగా టాయిలెట్లను నిర్మించడంతో తెలంగాణ రాష్ట్రానికి ప్రశంసలు అందుతున్నాయి.

ఇదిలావుండగా.. ఏపీలో ఇంకా 10,363 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీంతో కేంద్రం ఏపీ చేపట్టిన చర్యలపై కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా.. ఏపీలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా వుండటంతో ఈ మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాలు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles