దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన అద్భుతశిల్పం ‘బాహుబలి’ ఘనవిజయం సాధించి ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ.. ఇలా నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్నిరంగాల్లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి ప్రాంతీయ చిత్రంగా చరిత్ర సృష్టించిన ఈ చిత్రానికి మరో ఘనత వచ్చి చేరింది.
హిందీలో విడుదలైన ఈ ‘బాహుబలి’ చిత్రం.. వందకోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన తొలి డబ్బింగ్ సినిమాగా నిలిచింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ ఆధ్వర్యంలోని ‘ధర్మా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై విడుదలైన ఈ చిత్రం.. వందకోట్ల క్లబ్ లోకి చేరింది. విడుదలైన నాలుగు వారాల్లో ఈ చిత్రం 103.51 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని ట్రేడ్ అనలిస్టులు తెలిపారు. ఇంకొక విశేషం ఏమిటంటే.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయ్ జాన్’ చిత్రం బరిలో వున్నప్పటికీ.. ‘బాహుబలి’ వసూళ్లలో ఏమాత్రం మార్పు రాలేదు. తొలివారంలోనే 40 కోట్లు కలెక్ట్ చేసిన ‘బాహుబలి’.. ఆ తర్వాత సల్మాన్ చిత్రం వచ్చినప్పటికీ మంచి కలెక్షన్లతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.
‘బాహుబలి’ వందకోట్ల క్లబ్ లోకి చేరడంతో కరణ్ జోహర్ దర్శకుడు బాహుబలిని ప్రశంసలతో ముంచెత్తారు. రాజమౌళి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, ప్రేక్షకులకు ఓ సరికొత్త ప్రపంచాన్ని కనువిందు చేశారని అతడు పేర్కొన్నాడు. ఇతర ఇండస్ట్రీల్లోనూ అక్కడి ప్రాంతీయ సినిమాలు రిలీజవుతున్నప్పటికీ.. ‘బాహుబలి’ మాత్రం రికార్డుల పరంపరను కొనసాగిస్తూ.. ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more