Train accident | MP | Madhyapradesh | West Central Railway

15 dead and 25 injured in madhya pradesh train derailments

Train accident, MP, Madhyapradesh, West Central Railway, Machak river, Harda

15 dead and 25 injured in Madhya Pradesh train derailments, rescue operations on: West Central Railway Nearly 25 passengers were so far reported injured after two trains derailed while crossing a swollen Machak river near Harda in Madhya Pradesh even as rescue operations continued, officials said today.

మధ్యప్రదేశ్ లో రైలు ప్రమాదాలు.. 15 మంది మృతి

Posted: 08/05/2015 08:04 AM IST
15 dead and 25 injured in madhya pradesh train derailments

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు ప్యాసింజర్ రైళ్లు నదిలో పడిపోయాయి. ముంబై నుంచి వారణాసి వెళ్తున్న కామయానీ ఎక్స్‌ప్రెస్‌, పాట్నా నుంచి ముంబై వెళ్తున్న జనతా ఎక్స్‌ప్రెస్‌ మధ్య ప్రదేశ్‌లోని మాచక్‌ వద్ద నదిలో పడిపోయాయి. అర్థరాత్రి సమయంలో మొదటగా కామయానీ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఐదు బోగీలు మాచక్‌ నదిలో పడిపోయాయి. మధ్యప్రదేశ్‌లోని హర్దాకు 20 కిలోమీటర్ల దూరంలోని కుదువా రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. 25 మందికి గాయాలయ్యాయి. కొన్ని రోజులుగా మధ్య ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు మాచక్ నది పొంగిపొర్లుతుంది. ప్రమాదం జరిగే సమయంలో బ్రిడ్జిపైన వరద నీరు ప్రవహిస్తుంది. రైలును నెమ్మదిగా నడిపినప్పటికీ.. ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.  ఆ తర్వాత వెంటనే జనతా ఎక్స్‌ప్రెస్‌ కు చెందిన మూడు బోగీలు కూడా నదిలో పడిపోయాయి. ఈ రెండు ప్రమాదాల్లో భారీగానే ప్రాణనష్టం ఉంటుందని భావిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే 70 మందిని కాపాడినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Train accident  MP  Madhyapradesh  West Central Railway  Machak river  Harda  

Other Articles