జాబ్ నోటిఫికేషన్లకు అంతా సిద్దం చేసి తెలంగాణ సర్కార్ తాజాగా ఆ పరీక్షలకు సంబందించిన సిలబస్ మీద దృష్టిసారించింది. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులు, ప్రొఫెసర్లు, టీఎస్పీఎస్సీ చైర్మన్, కమిషన్ సభ్యులు నిరంతరం సమీక్షలు, సమావేశాలు జరుపుతున్నారు. ముందు ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో ఇంజినీరింగ్ సబ్జెక్టుల సిలబస్ తయారీ ఇప్పటికే కొలిక్కి వచ్చినా మొత్తం కసరత్తు పూర్తికావడానికి కనీసం రెండువారాలైనా పడుతుందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. విస్తృత స్థాయి సబ్జెక్టులకు సిలబస్‌లు తయారు చేయాల్సి ఉండటంతోపాటు.. రిక్రూట్మెంట్ ప్రక్రియలో ముందు ముందు ఎటువంటి తలనొప్పులు ఎదురుకాకుండా, దీర్ఘకాలిక వ్యూహంతో కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుండటం కూడా ఈ జాప్యానికి కారణమవుతున్నది.
జనరల్ స్టడీస్‌లో పేపర్లో ఉండే అంశాలైన కరెంట్ అఫైర్స్, జాతీయం, అంతర్జాతీయం, జనరల్ సైన్స్, టెక్నాలజీ, జనరల్ ఇంగ్లిష్, మెంటల్ ఎబిలిటీ, ఎకానమీ, చరిత్ర, పరిపాలన అంశాలపై ఇప్పటికే నిపుణులతో సమావేశమై సిలబస్ రూపొందించే ప్రక్రియను కొలిక్కి తెచ్చినట్లు సమాచారం. మరోవైపు సంబంధిత సబ్జెక్ట్ నిపుణులతో సమావేశమై పరీక్షా పత్రాలను రూపొందిస్తున్నారు. సారూప్యత ఉన్న ఉద్యోగాల భర్తీని ఒకే సిలబస్‌తో పూర్తి చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ముఖ్యంగా ఇంజినీర్ల కొలువుల్లో ఈ ప్రక్రియ ను అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోడ్లు భవనాల శాఖ, గ్రామీణ తాగునీరు మురుగు నీటిపారుదల విభాగం, పంచాయతీరాజ్, ఇరిగేషన్ క్యాడ్ మున్సిపల్ శాఖల్లో భర్తీ చేయాల్సి ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొలువులకు ఈ ప్రక్రియను అవలంబిస్తారని సమాచారం.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు బీటెక్ విద్యార్హత, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత. ఈ రెండు ఉద్యోగాల హోదాలు, జీతం వేర్వేరు. అయితే ఖాళీల భర్తీలో సారుప్యం ఉన్న సిలబస్‌ను ఏకకాలంలో పూర్తిచేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఈ ఖాళీలకు ఆయా శాఖలను అనుసరించి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ పట్టభద్రులు అర్హులు. ఈ ఆరు విభాగాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సిద్ధం చేయాల్సి ఉంది. అంతేకాదు.. క్వశ్చన్ బ్యాంకులను కూడా రూపొందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సిలబస్‌లు, ఇతర పనుల పూర్తికి కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి సహా సభ్యులు, సబ్జెక్ట్ నిపుణులు రోజూ దాదాపు రాత్రి 9 గంటల వరకూ పని చేస్తున్నారు. ఇంత చేసినా ఇవన్నీ సమగ్రంగా కొలిక్కి రావడానికి కనీసం పదిపదిహేను రోజులు పడుతుందని అంటున్నారు. మొత్తంగా సిలబస్ రూపకల్పనను కనిష్ఠంగా పదిరోజుల్లో పూర్తిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో ఉంచి, తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more