Google | Doodle | Trafic signals

Google doodle unveiled to commemorate the first ever set of traffic lights being installed

Google, Doodle, Trafic signals, Anniversary, traffic lights

Google Doodle unveiled to commemorate the first ever set of traffic lights being installed They are the bane of impatient motorists and are responsible for thousands of road rage incidents across the globe. Now the humble traffic light has been honoured with a Google Doodle to celebrate its 100th Anniversary on Wednesday.

ట్రాఫిక్ సిగ్నళ్లకు వంద సంవత్సరాలు

Posted: 08/05/2015 08:59 AM IST
Google doodle unveiled to commemorate the first ever set of traffic lights being installed

ట్రాపిక్ సిగ్నళ్లకు ఉన్న ప్రాధాన్యత గురించి అంతా ఇంతా అని చెప్పలేం. రద్దీగా ఉన్న రోడ్ల మీద ట్రాఫిక్ సిగ్నళ్లు ఒక్క ఐదు నిమిషాలు పనిచేయకపోతే అంతా అస్థవ్యస్థంగా తయారవుతుంది. అలాంటి ఎంతో ప్రాధాన్యత ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్లు పుట్టి నేటికి సరిగ్గా వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. కాస్త ట్రాఫిక్ ఉంది అనిపిస్తే చాలు అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండాల్సిందే... లేదంటే అందరికి ఇబ్బందే. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ లేకుండా రోడ్ల మీద తిరుగలేనంతలా ఆ వ్యవస్థ మన జీవన విధానాన్ని ప్రభావితం చేసింది. అయితే 1914లో మొదటిసారి ట్రాఫిక్ సిగ్నళ్లకు రూపం వచ్చింది. నేటికి సరిగ్గా వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా గూగుల్ దీనిపై డూడుల్ తో సత్కరించింది. గూగుల్ సెర్చింజన్ ట్రాఫిక్ సిగ్నల్ ను ఎంతో ఆకర్ఫించేలా రూపొందించింది.



మొదటిసారిగా 1868 డిసెంబర్ 9వ తేదీన గ్యాస్ ఆధారంగా పనిచేసే ట్రాఫిక్ లైట్లను హౌస్ ఆఫ్ పార్లమెంట్, లండన్ వద్ద ఏర్పాటు చేశారు. అయితే ఆ గ్యాస్ ఆధారంగా పనిచేసే లైట్లను చేతి ద్వారా ఆపరేట్ చేయాల్సి వచ్చేది. 1869 జనవరి 2వ తేదిన గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగింది. దాంతో ట్రాఫిక్ లైట్ల మీద అనుమానాలు కలిగాయి. 1912లో లెస్టర్ వైర్ అనే పోలీస్ మొదటి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్లను అభివృద్ది చేశారు. కానీ అప్పుడు కేవలం రెడ్ లైట్ మాత్రమే ఉండేది. ఆగస్టు5, 1914నాడు ప్రస్తుతం్ వాడుతున్న గ్రీన్ లైట్ ను కూడా ట్రాఫిక్ లైట్ లలో చేర్చారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రాథమికంగా ఇవే ట్రాఫిక్ లైట్లను వాడుతున్నాం. అయితే టెక్నాలజీ మారుతున్న నేపథ్యంలో రకరకాల మార్పులు చోటుచేసుకున్నాయి.


కానీ మనం ఇప్పుడు రోడ్ల మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుతున్నామంటే దానికి అప్పట్లో ఎంతో కృషి చేసిన లెస్టర్ వైర్ అనే పోలీస్ అధికారి పుణ్యమే. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గూగుల్ దీనిపై డూడుల్ తో ఘనంగా సత్కరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Google  Doodle  Trafic signals  Anniversary  traffic lights  

Other Articles