తెలుగులో స్వర్గీయ ఇవివి సత్యనారాయణ రూపోందించిన చిత్రం కన్యాదానం.. అచ్చం అలాంటి కథను తలపించిందచి ఇతగాడి జీవితకథ. అయితే తన భార్య మనస్సును తెలుసుకుని అలానే చేసి సినిమాలో మాదిరిగానే కథను సుఖాంతం చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన పూల్ చంద్.. మూడేళ్ల తరువాత భార్యను కలుసుకోవాలని ఎంతో ఆతృతగా సొంత ఊరుకి రాగా.. అతని భార్య చందా పెద్ద షాకిచ్చింది. దీంతో అతనికి ఆవేశం పొంగుకొచ్చింది. అయితే ఆవేశాన్ని అణచుకొని స్థిమితంగా ఆలోచించాడు... తమ మధ్య నెలకొన్న సంక్షోభానికి చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నాడు.... అంతేనా..... కుటుంబ సభ్యుల్ని, గ్రామ పెద్దల్ని ఒప్పించాడు. .. ఇంతకీ భార్య ఇచ్చిన షాక్ ఏంటి? ఏమిటా పరిష్కారం...?. అందర్నీ ఎలా ఒప్పించాడంటే...
వివరాల్లోకి వెడితే ఫైజాబాద్‌కు చెందిన పూల్ చంద్ పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకున్నాడు. సంతోషంగా భార్య చందాను కాపురానికి తీసుకు వచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా జలంధర్‌కు వెళ్ళిపోయాడు. ఫోన్లో మాత్రమే భార్యాభర్తలిద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. అయితే కొన్నాళ్ల తరువాత ఇంటికి వచ్చిన అతనికి భార్య చందా షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను వేరే వ్యక్తిని ఇష్టపడుతున్నానంటూ బాంబు పేల్చింది. కేవలం పెద్దల కోసమే పెళ్లి చేసుకున్నానని... ఇక తన వల్ల కాదని తేల్చిచెప్పింది. దీంతోపాటూ పెళ్లి సమయంలో తనకు పెట్టిన నగలు, బట్టలు అన్నీ అతనికి తిరిగి ఇచ్చేసింది. పూల్చంద్తో కలిసి కాపురం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. దీంతో పూల్ చంద్ హతాశుడయ్యాడు. అందరిలాగానే అతడు కూడా చాలా ఆవేశానికి లోనయ్యాడు.
అయితే... భార్య నిజాయితీగా వ్యవహరించిన తీరు తనని ఆకట్టుకుందని పూల్‌చంద్ తెలిపాడు. పెళ్లికి ముందే చందా, సూరజ్ ప్రేమించుకున్నారని, అందుకే ఎలాగైనా వారికి న్యాయం చేయాలని భావించానని చెప్పాడు. తమ పెళ్లి మూలంగా విడిపోయిన ప్రేమికుల్ని తిరిగి కలపాలనే ఉద్దేశంతోనే కష్టపడి తమ కుటుంబసభ్యులను, గ్రామ పెద్దలను ఒప్పించినట్లు పూల్‌చంద్ వెల్లడించాడు. దీంతో గ్రామపెద్దల సమక్షంలో చందాకు కోరుకున్న ప్రియుడితో అంగరంగ వైభవంగా వివాహం జరిపించడమే కాకుండా, కానుకలతో అత్తారింటికి సాగనంపాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more