తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య మీద ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అయితే వచ్చే ఏడాది నుంచే కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానాన్ని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ విద్యా విధానాన్ని మూడు విభాగాలుగా విభజించామని చెప్పారు. మొదటిది కేజీ టు 4వ తరగతి, రెండోది 5 నుంచి 12వ తరగతి, మూడోది 12వ తరగతి తర్వాత విద్యగా విభజించామన్నారు. కేజీ టు పీజీ కోసం రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 చొప్పున 1,190 గురుకులాల ఏర్పాటుకు సీఎం కే చంద్రశేఖర్‌రావు అమోదం తెలిపారని వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్రంలోని గురుకులాలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకొస్తున్నామని తెలిపారు. గురుకులాల నిర్వహణ కోసం విద్యాశాఖ పరిధిలో ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటుచేసేందుకు సీఎం అమోదం తెలిపారని చెప్పారు.
దేశంలో మొదటిసారిగా తెలంగాణలోనే హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే బియ్యం కొలతల రూపంలో కాకుండా కడుపునిండా అన్నం పెట్టాలని సీఎం కేసీఆర్ భావించారని, ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పేద విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టేందుకు సన్నబియ్యం పంపిణీ కోసం పౌరసరఫరాలశాఖ అధికారులకు ఇండెంట్ పెట్టాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అన్ని సంక్షేమ హాస్టళ్లలో మెస్‌ఛార్జీలు ఒకేవిధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వారికి రూ.5 లక్షల వరకు సబ్సీడీ రుణాలు ఇస్తున్నామన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూ పంపిణీకోసం భూమి కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని కడియం పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more