Stampede | Jharkhand | Deoghar

11 killed and 50 injured in stampede at temple in jharkhands deoghar

Stampede, Jharkhand, Deoghar, Durga Temple, 11 died

11 Killed and 50 Injured in Stampede at Temple in Jharkhands Deoghar At least 11 people have been killed and 50 others injured in Jharkhand's Deoghar town in a stampede close to a temple of Goddess Durga. Thousands of devotees flock to the temple in the month of August each year to offer the holy water of the river Ganga to Lord Shiva at the town's famous Baidyanath temple.

జార్ఖండ్ లోని గుడిలొ తొక్కిసలాట..11 మంది మృతి

Posted: 08/10/2015 09:04 AM IST
11 killed and 50 injured in stampede at temple in jharkhands deoghar

ఈ తెల్లవారు జామున ఘోరం జరిగిపోయింది. జార్ఖండ్ లోని దియోఘర్ జిల్లాలోని బెలాబగన్ దుర్గామాత ఆలయం వద్ద సోమవారం ఉదయం 5.45 గంటలకు తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. సుమారు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తెల్లవారు జామునే సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయం బయట భక్తులు బారులు తీరారు. ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరవగానే భక్తులు ఆలయం లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

జార్ఖండ్ తరహా ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. యుపి, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో, తమిళనాడులో తాజాగా ఏపిలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. గోదావరి మమా పుష్కరాల సందర్భంగా మొదటి రోజు జరిగిన తొక్కసలాటలో 27 మంది భక్తులు ప్రాణాలు విడిచారు. అయితే పండుగలు, వేడుకలు ఉన్నప్పుడు పోలీసులు వచ్చే వారి సంఖ్యను సరిగ్గా అంచనా వెయ్యలేకపోవడం.. పూర్తి స్థాయిలో పోలీస్ భద్రత కల్పించకపోవడంతో ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. బెలాబగన్ ఆలయంలో కూడా భక్తులు ఒక్కసారిగా తోసుకురావడంతో తీవ్ర తొక్కిసలాట జరిగి 1 మంది భక్తులు ప్రాణాలు విడిచారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా గట్టి భద్రత, పటిష్ట ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Stampede  Jharkhand  Deoghar  Durga Temple  11 died  

Other Articles