ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మునికోటి మృతికి పలువురు రాజకీయ నేతలు తమ ప్రగాడ సంతాపం తెలిపారు. కోటి అంత్యక్రియలు నేడు తిరుపతిలో నిర్వహించనున్నారు. మృతికి సంతాపంగా తిరుపతి బంద్‌కు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. మునికోటి చనిపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవి, ఇతర సీనియర్ నేతలు చెన్నైకి వెళ్లాలని సూచించారు.
మునికోటి మృతి తనకు చాలా బాధ కలిగించిందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి సందర్భంలో ప్రత్యేక హోదాపై ఎక్కువగా మాట్లాడకుండా తనను తాను నియంత్రించుకుంటున్నానని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు పవన్. ప్రత్యేహోదా కోసం వ్యక్తి ఆత్మహత్యాకు పాల్పడటం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఏపీకి న్యాయం చేసేందుకు ఎన్డీఏ కట్టుబడి ఉందన్నారాయన. కాంగ్రెస్ అసమగ్రంగా రాష్ట్రాన్ని విభజించడం వల్లే సమస్య తలెత్తిందన్నారు వెంకయ్య. ప్రత్యేక హోదా కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. ఉద్వేగాలకు, భావోద్వేగాలకు లోనుకావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మునికోటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు.. ఇలాంటి అఘాయిత్యాలకు ఎవరూ పాల్పడవద్దని కోరారు.
కాగా ప్రత్యేక హోదాను కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేడు తిరుపతి బంద్ కు పిలుపునిచ్చింది. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా బంద్ కు మద్దతుగా నిలిచాయి. వైసీపీ నేతలు కూడా బంద్ కు తమ మద్దతును ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా కల్పించే వరకు తమ పోరాటం ఆగదని బంద్ లో పాల్గొన్న నాయకులు అంటున్నారు. కాగా తిరుపతి బంద్ ఫలితంగా వెంకటేశ్వర స్వామి భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. బంద్ విషయం ముందే తెలియకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి మొత్తం స్వచ్ఛందంగా బంద్ ను పాటిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more