Actor Shivaji Says That Those Who Do Not Participate In Bandh They Are Andhra scoundrels | Special Status Issue

Actor shivaji controversial comments on people over special status issue

actor shivaji, shivaji latest news, telugu actor shivaji, shivaji dharna, actor shivaji protest, shivaji protest special status, shivaji latest updates, actor shivaji controversies, bjp party, bjp party news, ap special status, hyderabad press club

Actor Shivaji Controversial Comments On People Over Special Status Issue : Actor Shivaji Says That Those Who Do Not Participate In Bandh They Are Andhra scoundrels In Hyderabad Press Club Press Meet.

‘వాళ్లందరూ ఆంధ్రా ద్రోహులు’ : శివాజీ సంచలనం

Posted: 08/10/2015 06:41 PM IST
Actor shivaji controversial comments on people over special status issue

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రరాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, కొందరు సినీనటులు అందరూ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ నటుడు, ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు శివాజీ కూడా మొదట నుంచి పోరాటం కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం వినూత్న పద్ధతుల్లో నిరసనలు చేస్తూనే సంచలన వ్యాఖ్యలు గుప్పిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోమారు ఆ తరహాలోనే కామెంట్లు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం మంగళవారం ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంద్ లో అందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బంద్ లో పాల్గొననివారు ఆంధ్రా ద్రోహులని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, దానిని సాధించేందుకు ప్రతిఒక్కరు పోరాడాల్సిందేనని, బంద్ లో పాల్గొనాల్సిందేనని ఆయన అందరికి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం కేంద్రానికి వుందని, 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి కేంద్రం తప్పించుకోరాదని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా కోసం వైపీసీ అధ్యక్షుడు జగన్ ముందుకు రావడం హర్షణీయమని శివాజీ అన్నారు. ప్రభుత్వంతో ప్రతిపక్షం చేయి కలిపితేనే ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాపై ఎవరు ధర్నా చేసినా.. అందుకు తమ మద్దతు వుంటుందని హామీ ఇచ్చారు.  ప్రత్యేక హోదా ప్రజలకు సంబంధించిన విషయమని, చంద్రబాబు దీనిపై అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. శివాజీ కేంద్రమంత్రులకు స్పష్టమైన హెచ్చరిక కూడా ఇచ్చారు. పార్లమెంటును అవమానపరిచేలా మాట్లాడొద్దని, రెచ్చగొట్టే మాటలు వెంకయ్యనాయుడు మట్లాడకుండా వుండేలా ఎవరైనా చెప్పాలని సూచించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor shivaji  ap special status  hyderabad press club  

Other Articles