Ap | Special status | Ap Bund

Communist parties call for bund in state of ap

Ap, Special status, Ap Bund, Communist parties, Chandrababu, Modi, NDA Govt

Communist parties call for bund in state of ap. From this morning communists protesting to provide special status for the state of ap.

నేడు ఏపీ బంద్.. ప్రత్యేక హోదాకై పోరాటం

Posted: 08/11/2015 08:03 AM IST
Communist parties call for bund in state of ap

ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. మునికోటి ఆత్మత్యాగంతో ఉద్యమ తీవ్రత మరింత పెరిగింది. మునికోటి మృతి కేంద్రం పాపమేనంటున్న విపక్షాలు ఇవాళ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర విభజనతో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మరోసారి ఆవేశంతో రగిలిపోతున్నారు. తమ మనోభావాలకు ఎలాగూ విలువ ఇవ్వని ఆనాటి కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని విభజించింది. ఆ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి రెండు నెలల పాటు ఉద్యమబాట పట్టినా అప్పటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

 ఇక తమకు న్యాయబద్దంగా రావాల్సిన రాయితీలను కూడా ఇవ్వకుండా జాప్యం చేస్తున్న మోడీ సర్కారుపై కన్నెర్ర జేస్తున్నారు.అన్ని విధాల తీవ్రంగా నష్టపోయిన ఏపీని ప్రత్యేక హోదాతో ఆదుకుంటారని కొండంత ఆశలు పెట్టుకున్న తెలుగు ప్రజల నమ్మకంపై నీళ్లు చల్లేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల విధానాలు ఉండడంతో మరోసారి ఉద్యమించక తప్పదన్న అభిప్రాయానికి వచ్చారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బీజేపీ, టీడీపీలపై పోరు సభలో ఉద్వేగానికి లోనై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మునికోటి ఇచ్చిన నినాదాలు ఏపీ ప్రజలకు ఉద్యమానికి సిద్దం చేస్తున్నాయి. తిరుపతి బంద్ కు పిలుపు నిచ్చిన కాంగ్రెస్ పార్టీకి సీపీఎం, సీపీఐ పార్టీలు తోడయ్యాయి.

ప్రత్యేక హోదాపై ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్‌కు ప్రశ్నించే సమయం ఆసన్నమైందంటూ బ్యానర్లు వెలిశాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినప్పుడు అండగా ఉన్నామంటూ నాటకాలాడిన బీజేపీ అసలు బండారం ఇప్పుడు బయటపడిందని నాయకులు గొంతెత్తారు. పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి, రాజధాని నిర్మాణంలో ఖర్చు ఇస్తామని, ఉత్తరాంద్రకు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మోడీ.. మాట తప్పారన్నారు. దీంతో ఏపీలోని 13 జిల్లాల్లోనూ సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నారు. విద్య, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. అధికారులు ముందుగానే స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇక ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. డిపోలకే పరిమితం అయ్యాయి. పలు జిల్లాల్లో వామపక్షాల ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Special status  Ap Bund  Communist parties  Chandrababu  Modi  NDA Govt  

Other Articles