Sunder Pichai | CEO of Google | Larry Page | Sergei Brin

Sundar pichai is the new chief of google

Google, Google company, Sunder Pichai, CEO of Google, New Chief of Google, Alphabet, Larry Page, Sergei Brin

Sundar Pichai is the New Chief of Google His name may not ring a bell, but chances are you know some of the products Google's new CEO, Sundar Pichai, has worked on, including the Chrome browser and Android mobile operating system. Pichai, 43, was named chief executive officer of the Internet titan Monday, as Google unveiled a new corporate structure creating an umbrella company dubbed Alphabet.

గూగుల్ సిఇఓగా భారతీయుడు

Posted: 08/11/2015 08:36 AM IST
Sundar pichai is the new chief of google

భారత కీర్తి కెరటాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. ప్రపంచంలో టాప్ కంపెనీలుగా ఎంతో పేరున్న కంపెనీలకు మన భారతీయులు నాయకత్వం వహిస్తుండటం అందరికి గర్వకారణం. మైక్రోసాఫ్ట్ సిఇఓగా సత్య నాదెళ్ల నియమాకం కావడంతో భారత కీర్త ప్రతిష్టలు మరింత పెరిగాయి. మన భారతీయులు ఎందులోనూ తీసిపోరు అని నిరూపించారు. తాజాగా మరో భారతీయ మాణిక్యం మన కీర్తిని మరింత పెంచారు. ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీని అందించే కంపెనీ గూగుల్ కు మన భారతీయుడే సిఇఓగా కావడం సగటు భారతీయుడు గర్విస్తున్నారు. సుందర్ పిచాయిని గూగుల్ కంపెనీ సిఇఓగా ప్రకటిస్తు గూగుల్ వ్యవస్థాపకులు ల్యాపీ పేజ్, సెర్గీ బ్రిన్ ప్రకటించారు. సుందర్ పిచాయి భారత్ లోనే ఎడ్యుకేషన్ పూర్తి చేసి.. అంచలంచెలుగా ఎదుగుతూ గూగుల్ కంపెనీకే సిఇఓగా ఎదిగారు.

అప్పుడు సత్య నాదెళ్ల, ఇప్పుడు సుందర్ ఇలా మన భారతీయులు ప్రపంచ రూపురేఖలను మారుస్తున్న కంపెనీలకు బాధ్యత వహిస్తుండటం గమనార్హం. అయితే సుందర్ చెన్నై వాసి. ఖరపూర్ ఐఐటిలో తన ఎడ్యుకేషన్ ను పూర్తి చేసి అక్కడి నుండి స్టాన్ఫోర్డ్ కు వెళ్లారు. తర్వాత అంచలంచెలుగా ఎదిగి గూగుల్ కంపెనీకి సిఇఓగా ఎదిగారు. ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సుందర్ పేరును కంపెనీ స్థాపకులు ప్రకటించారు. 2004 నుండి గూగుల్ లో పనిచేస్తున్న సుందర్ పై కంపెనీ స్థాపకులు ల్యారీ ఎంతో నమ్మకం ఉంది. సుందర్ కంపెనీ కోసం ఎంతో కష్టపడుతున్నారని అందుకే గూగుల్ బాధ్యతలు తనకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ల్యారీ వెల్లడించారు. కాగా ల్యారీ ప్రస్తుతం ఉన్న గూగుల్ కాకుండా మిగిలిన గూగుల్ రిలేటెడ్ కంపెనీలు అన్నింటిని కలిపి ఆల్ఫాబిట్ అనే కంపెనీకి సిఇఓగా వ్యవహరించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Google  Google company  Sunder Pichai  CEO of Google  New Chief of Google  Alphabet  Larry Page  Sergei Brin  

Other Articles