కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు.. తరతరాలకు చెరగని ఇలవేలుపులవుతారు అంటూ పాత ఎన్టీఆర్ సినిమాలోని ఓ పాట ఉంది. అనగననగ రాగ మతిశయనిల్లుచునుండి... తినగ తినగ వేమ తియనుండు.... సాధనమున పనులు సమ కూరు ధరలోన.. విశ్వదాభిరామ వినువేమ అనే పద్యం కూడా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ పద్యానికి నిలువెత్తు రూపంగా నిలుస్తున్నాడో ఖైదీ. ఖైదీ అనగానే ఎక్కడో తప్పుడు భావన.. తప్పు చేసి ఉంటాడు కాబట్టి అలా జరిగి ఉంటుంది అనే భావన కానీ అలాంటి వారు ఏమైనా చెయ్యవచ్చు అని నిరూపించారు. ఓ ఖైదీ తన ప్రతిభకు పదును పెట్టి అరుదైన గౌరవాన్ని పొందాడు.
వారణాసి జైలులో ఉన్న ఓ 23 ఏళ్ల ఖైదీ.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) నుంచి డిప్లొమా ఇన్ టూరిజం స్టడీస్‌లో బంగారం పతకం సాధించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అజిత్‌కుమార్ సరోజ్ బనారస్ హిందూ యూనివర్సిటీలో డిప్లొమా పూర్తి చేశాడు. ఇగ్నో 28వ స్నాతకోత్సవం సందర్భంగా అతడికి శనివారం అవార్డు ప్రదానం చేశారు. డాక్టర్ రాం మనోహర్ లోహియా అవద్ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ జీసీ జైస్వాల్ అతడికి బంగారు పతకం అందిస్తూ ఇగ్నో రూపొందించిన అజిత్ బయోడేటా చదివి వినిపించారు. హత్యకేసులో పదేళ్ల శిక్ష పడిన అజిత్ 2012 నుంచి వారణాసి జైలులో ఖైదీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఇగ్నో అందిస్తున్న ఏడాది కోర్సు డిప్లొమా ఇన్ టూరిజం స్టడీస్‌పై దృష్టిపెట్టిన అజిత్ సబ్జెక్టులో టాపర్‌గా నిలిచాడు. ఇగ్నో వారణాసి 20 జిల్లాల పరిధిలో 6వేల మంది విద్యార్థులు చదువుతుండగా బంగారు పతకం సాధించిన తొలిఖైదీ అజిత్ అని రీజియన్ డైరెక్టర్ ఏఎన్ త్రిపాఠి వెల్లడించారు. కాగా, గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఖైదీ కుటుంసభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more