Chandrababu | Special status | ap

Ap cm chandrababu naidu ready to fight on central govt for special status for the state of ap

Chandrababu, Special status, ap, NDA, Central Govt, Modi, Arun jaitly, Venkiah Naidu

AP CM Chandrababu Naidu ready to fight on Central govt for special status for the state of ap. All parties in the state of ap, protesting for special status.

ఇక కేంద్రంతో కయ్యానికైనా బాబు సిద్దమే

Posted: 08/12/2015 08:25 AM IST
Ap cm chandrababu naidu ready to fight on central govt for special status for the state of ap

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విషయం అర్థమైంది. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులతో ముందే సినిమా తెలిసి పోయింది. అందుకే ముందు జాగ్రత్తలకు దిగుతున్నారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్నట్లు చంద్రబాబు నాయుడు వ్యవహారాలను సరిచేయడానికి పూనుకున్నారు. మునికోటి ఆత్మహత్య తర్వాత జరుగుతున్న పరిణామాలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో టిడిపి పార్టీ భాగస్వామ్య నపార్టీగా ఉండటం, ఎన్నికల సమయంలో టిడిపి, బిజెపి పార్టీలు కలిసి పోటీ చెయ్యడంతో ప్రత్యేక హోదా అనివార్యం అని తెలుసుకున్నారు. ఏపిలోని అన్ని పార్టీలు కలిసి ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వాన్ని , చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే అవకాశాలు గట్టిగా ఉన్నాయని చంద్రబాబు నాయుడు గ్రహించారు. అందుకే ప్రస్తుతం మారిన పరిస్థితుల ఆధారంగా తాను కూడా తన స్ట్రాటజీని మారుస్తున్నారు.

నిన్నటి దాకా కేంద్ర ప్రభుత్వం కాస్త ఆలస్యంగా అయినా సరే ప్రత్యేక హోదా కల్పిస్తుంది అనే నమ్మకంతో ఉన్న ఏపి ప్రజలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విభిన్న ప్రకటనలతో నిరాశలో ఉన్నారు. ఓ మంత్రి పార్లమెంట్ సాక్షిగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేం.. కుదరదు అని ఖరాఖండిగా కుండ బద్దలు కొడతారు. కానీ మరో కేంద్ర మంత్రి మాత్రం అది కొన్ని రాష్ట్రాల విషయంలో వచ్చిన ప్రకటన అంతే కానీ ఏపికి అది వర్తించదు అని అంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటో కూడా ఏపి ప్రభుత్వానికి, ప్రజలకు అర్థం కావడం లేదు. ఇక ఏపిలోని ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ప్రత్యేక హోదా కోసం ముందుండి పోరాటానికి సిద్దమయ్యాయి. మునికోటి మృతి తర్వాత వైసీపీ, కాంగ్రెస్లతో పార్టీ ఎర్రజెండా పార్టీలు కూడా ముందుకుే వచ్చాయి. రాష్ట్రానికి ఎలాగైనా సరే ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

అందుకే చంద్రబాబు నాయుడు తన మెతక వైఖరిని రాం రాం చెప్పారు. ఎన్నికల సమయంలో ఏపికి ఇచ్చిన ప్రత్యేక హోదా మీద ఇప్పటికే తేలకపోవడంపై గుర్రుగా ఉన్నారు. ప్రత్యేక హోదా కల్పించాలని ప్ర.జలు రోడ్ల మీదకు వచ్చి.. ప్రభుత్వం మీద తీవ్రంగా ఆగ్రహాన్ని నింపుకోక ముందే ఏదో నిర్ణయాన్ని కేంద్రం నుండి రాబట్టుకోవాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ వేస్తున్నారు. అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మరో కేంద్ర మంత్రి వెంకయ్య  నాయుడుతో మంతనాలు జరిపారు. రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ప్రత్యేక హోదా మీద నమ్మకం పోయిందని... కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నాళ్లో వెనకేసుకు రాలేనని చంద్రబాబు నాయుడు వారితో అన్నట్లు సమాచారం. ఇక మీదట ప్రతిపక్షమైనా కానీ మెతక వైఖరి ప్రదర్శించేది లేదని చంద్రబాబు నాయుడు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే కేంద్ర మంత్రులు ఎంతలా సర్దిచెప్పడానికి ప్రయత్నాలు చేసినా వినుకోలేదని సమాచారం. ఎంపీలకు కూడా పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడాలని హుకుం జారీ చేశారని సమాచారం. మొత్తానికి చంద్రబాబు నాయుడు కనీసం ఇప్పుడైనా మేలుకొన్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Special status  ap  NDA  Central Govt  Modi  Arun jaitly  Venkiah Naidu  

Other Articles