Hyderabadi | TRS | Holdings | Abuse

Hyderabadi used ugly language to abuse trs leaders

Hyderabadi, TRS, Holdings, Abuse, Ugly Language, Bonalu, Telangana, GHMC

Hyderabadi used ugly language to abuse TRS leaders. A Hyderabadi fire on TRS party leaders for putting holdings and posters on Bonalu festival.

ITEMVIDEOS: టిఆర్ఎస్ వాళ్లను బూతులు తిట్టిన ఓ హైదరాబాదీ

Posted: 08/12/2015 09:06 AM IST
Hyderabadi used ugly language to abuse trs leaders

ఎవడు మీకు పర్మిషన్ ఇచ్చారు...? పెద్ద పెద్ద హోర్డింగ్ లు ఎలా పెడతారు...? హనుమంతుడి గుండెలో రాముడిలా బిల్డప్ కు గుండాగాళ్ల ఫోటోలు రోడ్ల మీద ఎందుకు కనిపిస్తున్నాయి..? ప్రజల ఆరోగ్యాలకు, ప్రాణాలను పట్టించుకోరా..? ఇది ఓ కడుపు మండిన హైదరాబాదీ అడిగిన ప్రశ్నలు. హైదరాబాద్ లో ముందు ఏముందో కూడా కనిపించనంతలా పెద్ద పెద్ద హోర్డింగ్ లు, కటౌట్లు ఏర్పాటు చెయ్యడం మీద తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో తాజా వీడియో హల్ చల్ చేస్తోంది. నాయకులను, జిహెచ్ఎంసీ అధికారుల మీద తన ఆగ్రహాన్ని చూపించారు కామన్ మేన్. రోడ్లకు మధ్యలో, సిగ్నల్స్ వద్ద, టర్నింగ్స్ లలో, చౌరాస్తాల వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్ లు , కటౌట్ ల వల్ల ప్రజలు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారో తన మాటల ద్వారా వివరించారు.



బోనాల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్ లు, కటౌట్లు, పెద్ద పెద్ద పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో పోస్టర్లు, అక్రమ హోర్డింగ్ లు ఉండకూడదని ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ సొంత పార్టీ నాయకులు భారీ లెవల్ లో హైదరాబాద్ రోడ్ల మీద, రోడ్ల పక్కన ఇష్టా రాజ్యంగా ఏర్పాటు చెయ్యడం మీద మండిపడ్డారు. బోనాల జాతర అంటే తెలంగాణ ప్రజలు అందరూ చేసుకునే పండగనే అని.. కానీ అందుకు ఇలా ప్రజలకు ఇబ్బందులు కలిగేలా హోర్డింగ్ లు, పోస్టర్లు ఏర్పాటు చెయ్యడం మీద అంతతెత్తున లేచారు ఓ హైదరాబాదీ. టిఆర్ఎస్ నాయకులను తిట్టాల్సిందా తిట్టేశారు... ఇక ఇంత తంతు జరుగుతున్నా పట్టించుకోని జిహెచ్ఎంసీ అధికారులను కూడా అతగాడు కడిగిపారేశాడు. అధికారులకు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని మండిపడ్డారు. మొత్తానికి టిఆర్ఎస్ నాయకులు, మిగిలిన నాయకులు పెద్ద పెద్ద హోర్డింగ్ లు, పోస్టర్ల జోలికి పోకుండా ఎంతో మేలు. ఒకవేళ అభిమానం ఉంటే పచ్చబొట్టు పొడిపించుకోవాలి అన్న ఆ వ్యక్తి సలహాను కూడా పాటించేవీలుంటే పాటించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabadi  TRS  Holdings  Abuse  Ugly Language  Bonalu  Telangana  GHMC  

Other Articles