SI | Medchal | Nirbhaya case

Si harrased a women in medchal

SI, Medchal, Nirbhaya case, RangaReddy, Missing

SI Harassed a women in Medchal. A women complaints to police for missing her husband, But the SI at that police station harassed that women.

భర్తని వెదికి పెట్టండి అంటే నా దగ్గరికి రా అన్న ఎస్సై

Posted: 08/12/2015 01:35 PM IST
Si harrased a women in medchal

తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చెయ్యడానికి వస్తే ఆమె అందంగా ఉంది కదా అని.. వస్తావా... లేదంటే నీ భర్త కనిపించకపోవడానికి కారణం నువ్వే అంటూ కేసు నీ మీదే పెడతానంటూ బెదిరింపులు. ఇది ఓ ఎస్సైగారి జులుం. బాధితులను కాపాడాల్సిన పోలీసులే రౌడీగిరి చేస్తే ఎలా..? న్యాయం చెయ్యాల్సిన పోలీసులు న్యాయం కోసం వచ్చిన వారి మీద కన్నేస్తే ఎలా..? రంగారెడ్డి జిల్లా పరిధిలో జరిగిన దారుణం. భర్త కనిపించడం లేదని వెతికిపెట్టాలని ఫిర్యాదు చెయ్యడానికి వస్తే ఆ బాధితురాలి మీదే కన్నేసి చివరకు కటకటాలపాలయ్యారు. ఫోన్ లో తన దగ్గరికి రమ్మన్న ఆడియో టేపులతో సహా సాక్షాధారాలు పక్కా ఉండటంతో ఉన్నతాధికారులు ఆ ఎస్సైని సస్పెండ్ చేశారు.




మేడ్చల్‌కు చెందిన ఓ ఇల్లాలు తన భర్త కన్పించడం లేదంటూ పోలీసు స్టేషన్ వెళ్లింది..భర్త ఫోటో తీసుకెళ్లి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ను కలిసింది.. విషయం చెప్పి కన్నీరుమున్నీరయింది... కానీ ఆ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మాత్రం ఆ ఇల్లాలిపై కన్నేసి ఆమెను కేసు అడ్డంపెట్టుకుని వేధించడం మొదలుపెట్టాడు.. నిత్యం ఫోన్లు చేస్తూ అక్కడ ..లేదంటే ఇక్కడ..ఇలా ఎక్కడో ఒక చోట కలుద్దామంటూ వెంటాడుతున్నాడు.. తాను చెప్పిన చోటుకు వచ్చి కలువకపోతే నీ భర్త కేసులో నిన్నే ఇరికిస్తానంటూ హెచ్చరికలు చేశాడు..దీంతో బాధలు భరించలేక ఆ ఇల్లాలు సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేసింది..దీంతో ఏసీపీ అశోక్‌కుమార్‌కు రెఫర్ చేయడంతో వెంటనే ఎస్ఐ సతీష్‌ను కంట్రోల్‌రూంకు అటాచ్ చేశారు.

అసలు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే పోకిరీ వేశాలు వేస్తుండడంతో...తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు రక్షణగా ఉండాల్సిన వారే వక్రబుద్దిని ప్రదర్శిస్తూ..ఇలా పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. ఇలాంటి కేటుగాళ్లను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SI  Medchal  Nirbhaya case  RangaReddy  Missing  

Other Articles