SC stays former minister Dayanidhi Maran's arrest till Sep 14

Dayanidhi maran gets protection from arrest till september 14

dayanidhi maran,supreme court,madras high court,illegal telephone exchange case,dmk,kalanithi maran,sun tv,telephone exchange case,national

It may be noted that the Madras high court had cancelled Maran's interim anticipatory bail in the controversial telephone exchange case and directed him to surrender before the CBI within three days

దయానిధి మారెన్ కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట..

Posted: 08/12/2015 12:52 PM IST
Dayanidhi maran gets protection from arrest till september 14

అక్రమంగా తన నివాసంలో టెలిఫోన్ ఎక్స్ఛేంజి నిర్మించారన్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీమంత్రి దయానిధి మారన్కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. దయానిధి మారన్ మూడు రోజుల వ్యవధిలో లొంగిపోవాలన్న మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ కేసులో సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఈ కేసులో మారన్ ముందస్తు బెయిల్ను మద్రాసు హైకోర్టు సోమవారం రద్దు చేసింది.  అంతే కాకుండా మారన్ మూడు రోజుల్లోపు లొంగిపోవాలని పేర్కొంది.  దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కాగా మారన్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సీబీఐ జూలై నెలలోనే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో ఆయనకు సహకరించకూడదని.. ఆ కేసులో ప్రధాన నిందితుడు ఆయనేనని సీబీఐ తెలిపింది. దయానిధి కేంద్రమంత్రిగా 2004 - 2007 కాలంలో పని చేశారు. ఆ సమయంలో తన సోదరుడైన కళానిధి మారన్కు 300 హైస్పీడ్ టెలిఫోన్ లైన్లు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. కళానిధి ఆ లైన్లను సన్ టీవీ కార్యక్రమాల్ని కి అప్ లింక్ చేయడానికి ఆ లైన్లను వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dayanidhi Maran  Supreme Court  Madras High Court  Illegal telephone exchange case  DMK  

Other Articles