Dolly Bindra has written to the Mumbai Police Commissioner complaining that she has received threatening calls

Dolly bindra files complaint against radhe maa threat life

radhe maa, radhe maa controversy, dolly bindra, actress dolly bindra news, dolly bindra controversy, radhe maa latest news, radhe maa updates, dolly bindra mumbai police, dolly bindra movies, radhe maa affairs

Dolly Bindra Files Complaint Against Radhe Maa Threat Life : Bollywood actress and former devotee of controversial 'god woman' Radhe Maa, Dolly Bindra has written to the Mumbai Police Commissioner complaining that she has received threatening calls.

‘రాధే మా’ను చూసి జంకుతున్న బాలీవుడ్ నటి

Posted: 08/13/2015 04:56 PM IST
Dolly bindra files complaint against radhe maa threat life

వివాదాస్పద ‘గాడ్ ఉమెన్’ రాధే మా ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకోగా.. తాజాగా మరో కేసులో ఇరుక్కుంది. ఈమెతో తనకు ప్రాణహాని, తనని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని బాలీవుడ్ నటి డాలీ బింద్రా ముంబై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో రాధే మా, ఎంఎం గుప్తా, మరికొందరు భక్తులపై తనకు అనుమానాలు వున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు రాధేమా అనుచరుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు దర్యాప్తు చేస్తారని ఆమె స్పష్టం చేశారు.

ఇదిలావుండగా.. నటి డాలీ కూడా గతంలో ‘రాధే మా’ భక్తురాలే. అటువంటి ఆమె ఇప్పుడు రాధే మాపై ఫిర్యాదు చేయడంపై పలురకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి మధ్య వ్యక్తిగత పొరపొచ్చాలు చోటు చేసుకుని వుండవచ్చునని, ఆర్థిక లావాదేవీల వ్యవహారపై విభేదాలు ఏర్పడి వుంటాయని.. అందుకే ముందుజాగ్రత్తగా నటి డాలీ ఫిర్యాదు చేసి వుండవచ్చునని అంటున్నారు. మరోవైపు.. నటి డాలీ దగ్గర డబ్బులు దోచే ప్రయత్నంలో భాగంగా రాధేమా, అనుచరులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారని, డబ్బు ఇవ్వని పక్షంలో చంపేస్తామని బెదిరించినట్లు అంతర్గత వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఎంతమాత్రం నిజమో తెలియాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే!

కాగా.. రాధేమాకు ఇప్పటికే వరకట్న కేసులో ముంబై పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే! నిక్కీ గుప్తా అనే మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న కేసు నమోదు చేశారు. మరోవైపు.. రాధేమా మాయమాటల వల్ల గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబంలోని ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా రమేష్ జోసి అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం విదితమే! ఇలా మరెన్నో వివాదాల్లో రాధేమా చిక్కుకుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : radhe maa  dolly bindra  mumbai police  

Other Articles