Uma Bharti Says That She Is Not Yet Married And No Scope Now | Parliament Session | Speaker Sumitra Mahajan

Uma bharti comedy punch parliament session speaker sumitra mahajan

uma bharti, uma bharti news, uma bharti comedy, uma bharti comedy punch, speaker sumitra mahajan, sumitra mahajan latest news, lok sabha session, parliament session

Uma Bharti Comedy Punch Parliament Session Speaker Sumitra Mahajan : "I am not yet married and there is no scope also." This is what 56-year-old Union Minister Uma Bharti quipped in the Lok Sabha after a slip of tongue by Speaker Sumitra Mahajan.

పార్లమెంటులో నవ్వులు పూయించిన ‘శ్రీమతి’

Posted: 08/13/2015 07:32 PM IST
Uma bharti comedy punch parliament session speaker sumitra mahajan

మొదటి రోజు నుంచి వాడీవేడీగా కొనసాగిన పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో చివరిరోజు మాత్రం నవ్వులు పూశాయి. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అనుకోకుండా దొర్లిన ఒక చిన్న పొరపాటు అందరినీ కడుపుబ్బా నవ్వించేసింది. ఇంతకీ ఆ సన్నివేశం ఏంటి..? అని అనుకుంటున్నారా..! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

సభలో ప్రశ్నోత్తరాల సమయంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటన చేయాల్సిందిగా కేంద్రమంత్రి ఉమాభారతిని కోరుతూ.. పొరబాటుగా ‘శ్రీమతి’ అని సంబోధించారు. అంతే! ఆ మాట విన్న అనంతరం వెంటనే ఉమాభారతి స్పందిస్తూ.. తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని, భవిష్యత్తులో కూడా అవకాశం లేదని, అసలు తన జీవితంలో వివాహానికి చోటు లేదని అన్నారు. ‘నేను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. భవిష్యత్తులో కూడా ఆ అవకాశం లేదు. ఇక్కడ వేకెన్సీ బోర్డు కూడా లేదు’ అని ఆమె అనడంతో సభలో వున్న సభ్యులంతా నవ్వేశారు.

అటు తన పొరపాటుకు స్పీకర్ క్షమాపణ చెప్పి తన మాటను సవరించుకున్నారు. అక్కడితో ‘శ్రీమతి’ అంశం ముగిసింది. మధ్యప్రదేశ్ కు చెందిన 56 ఏళ్ల ఉమాభారతి.. కేంద్రజనవరుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uma bharti  sumitra mahajan  parliament session  

Other Articles