Twitter finally drops the 140-character limit from direct messages

Twitter removing 140 character limit from direct messages

twitter, twitter character limit, twitter ends character limit, twitter character, twitter dm, twitter direct messages, twitter followers, technology, social media, technology news

Twitter has announced to have finally pulled out the 140 character limit from Direct Messages. Twitter said it has begun rolling out the change across Android and iOS apps, on twitter.com, TweetDeck, and Twitter for Mac.

ఇకపై ట్విట్టర్ మెసేజ్.. వివరణాత్మకంగా, స్పష్టంగా..

Posted: 08/13/2015 09:57 PM IST
Twitter removing 140 character limit from direct messages

ట్విట్టర్ అకౌంటుదారులకు, ఫాలోవర్స్ కు ఆ సంస్థ ఒక శుభవార్తనందించింది. ఇప్పటి వరకు ట్విటర్లో ఒక విషయాన్ని చెప్పాలంటే నాలుగైదు ట్వీట్లుగా విడగొట్టి చెప్పేవాళ్లం. ఇకపై ఆ అవసరం ఉండదు. ఎంత పెద్ద విషయాన్నైనా ఒకే ట్వీట్ ద్వారా చెప్పొచ్చు. మెసేజ్ పంపించడంలో గరిష్టంగా ఉన్న 140 క్యారెక్టర్ల పరిమితిని ట్విట్టర్ గురువారం ఎత్తేసింది. సంస్థ అధికారి సచిన్ అగర్వాల్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై ఎంత పెద్ద విషయాన్నైనా.. ఒకే ట్వీట్‌లో చెప్పే సదుపాయాన్ని కల్పిస్తున్నామని, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ యూజర్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉందని అగర్వాల్ పేర్కొన్నారు. మొబైల్ యూజర్లు అపరిమిత మెసేజ్‌లను అందుకోవచ్చని, కానీ పంపించడానికి అవకాశం ఉండదని ఆయన వివరించారు. అంతేకాకుండా ఏ ఫార్మాట్‌లో ఉన్న ఫోటోలనైనా పంపించుకోవచ్చని చెప్పారు.
 
వాట్స్‌యాప్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల నుంచి ట్విట్టర్ గట్టిపోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో అక్షర పొదుపుకి స్వస్తి పలకాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో ‘మైక్రో బ్లాగింగ్ సైట్’ అనే పేరును ట్విట్టర్ తుడిచేసుకోనుంది. సెలబ్రిటీలు తమ ఫ్యాన్సుకు అర్థం కాకుండా పొడి అక్షరాలు, అబ్రివేషన్లతో చేసే ట్వీట్లకు ఇప్పుడు బ్రేక్ పడినట్టే. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. వాళ్లు చెప్పాలనుకున్న విషయాన్ని సవివరంగా, స్పష్టంగా తమ అభిమానులకు తెలియజేయొచ్చు. దీంతో అవతలివారికి కూడా వాళ్ల భావం పూర్తి స్థాయిలో అర్థమవుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : twitter  twitter character limit  sachin agarwal  

Other Articles