Rahul Gandhi's 'cheat sheet' for Parliament speech caught on camera

Rahul gandhis cheat sheet for parliament speech amuses social media

rahul gandhi, rahul gandhi cheat-sheet, rahul gandhi in parliament, rahul cheating parliament, monsoon session, parliament session, vyapam scam, lalit modi controversy, india news, india politics

The photograph captures a shot of a piece of paper that Rahul carried into the Parliament before his speech. That speech was the one Rahul made amidst the debate on the Lalit Modi furore in the Lok Sabha on Wednesday.

రాహుల్ గాంధీకీ హిందీ రాయడం, చదవడం తెలియదా..?

Posted: 08/13/2015 09:59 PM IST
Rahul gandhis cheat sheet for parliament speech amuses social media

త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలను అందిపుచ్చుకోనున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి హిందీ రాయడం, చదవడం తెలియదా..? అంటే అవుననే సమాధానాలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో విస్తృత చర్చకు దారితీశాయి. సోషల్ మీడియా సహా ఇంటర్నెట్లో ఇప్పుడిదే ప్రశ్న హల్ చల్ చేస్తోంది. 'రాహుల్ గాంధీకి హిందీ రాదా' ఈ విషయమే ఇప్పుడు అంతా ఇంటర్నెట్లో ప్రశ్నించుకుంటున్నారు. బుధవారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లో లోక్సభలో లలిత్ గేట్ వ్యవహారంపై సుష్మా స్వరాజ్ ప్రసంగం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆ ప్రసంగంలో సుష్మాకు, ప్రధాని నరేంద్ర మోదీకి పలు సవాల్లు విసిరారు. ఓ రకంగా ఎన్నడూ లేనంతగా తన వాగ్దాటితో ఊగిపోయారు.

అయితే, ఆయన పార్లమెంటు సాక్షిగా మాట్లాడింది హిందీలోనే ఆయితే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా.. ముందుగానే ఒక పేపర్ పై రాసుకున్నారు. పాయింట్లు రాసుకున్నారు అందులో విచిత్రమేముంది అంటారా..? అక్కడికే వస్తున్నాం. ఆ కాగితంపై రాహుల్ రాసుకున్న ఆ మాటలన్ని ఇంగ్లిష్లో పెద్ద పెద్ద అక్షరాల్లో ఉండటం  లోక్ సభ నుంచి బయటకు వస్తుండగా, రాహుల్. చేతిలో వున్న కాగితాలపై ఓ మీడియా కెమెరా కన్ను పడింది. వెంటనే క్లిక్ మనిపించింది. దానిని జూమ్ చేసి చూడగా ఈ విషయం వెలుగుచూసింది.

రాహుల్ చేతిలోని పేపర్లో 'మోదీ ఏం చెప్తారో చూడాలని దేశం ఎదురుచూస్తుంది, వినాలనుకుంటుంది. లలిత్ గేట్, వ్యాపం, గాంధీ మూడు కోతులు' అనే వాక్యాలతోపాటు మరిన్ని ఉన్నాయి. దీనిపై పలువురు నెటిజన్లు విమర్శులు గుప్పించగా మరికొందరు సమర్థించారు. రాహుల్కు హిందీ రాదా, దేవనాగరి లిపిని ఆంగ్లంలో రాయడమేమిటీ అని కొందరు ప్రశ్నించగా, ప్రజాస్వామ్య దేశంలో రాహుల్కు రాసుకునే స్వేచ్ఛ కూడా ఉండకూడదు, ఇందులో చర్చాంశమేముంది అని సమర్థించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  parliament  speech  cheat-sheet  lok sabha  

Other Articles