Traffic analytics firm Parsely says its latest figures show the giant social network now accounts for more of the traffic to news sites than Google

Facebook has taken over from google as a traffic source for news

google, facebook, google facebook, google internet traffic, facebook internet traffic, facebook controversy, google controversy, google news, facebook news

Facebook has taken over from Google as a traffic source for news : Traffic analytics firm Parsely says its latest figures show the giant social network now accounts for more of the traffic to news sites than Google

‘ఫేస్ బుక్’ దెబ్బకు ‘గూగుల్’ అబ్బ

Posted: 08/20/2015 11:10 AM IST
Facebook has taken over from google as a traffic source for news

ప్రముఖ సెర్చ్ ఇంజన్ ‘గూగుల్’, సామాజిక మాధ్యమం ‘ఫేస్ బుక్’ మధ్య మొదటి స్థానానికై గతకొన్నాళ్ల నుంచి గట్టిపోటీ నడుస్తూ వస్తోంది. నిజానికి ఇంటర్నెట్ లో ‘గూగుల్’ ఆధిపత్యం చాలాకాలం నుంచి నడుస్తూనే వుంది. మధ్యలో ఇతర మాధ్యమాలు ఎన్ని వచ్చినప్పటికీ అవి గూగుల్ ధాటికి నిలబడలేకపోయాయి. దీంతో దీనికి పోటీ మరొకటి రాదని అంతా భావించారు కానీ.. ఇంతలోనే ఫేస్ బుక్ ప్రాభవం పెరుగుతూ వచ్చింది. ఆమధ్య గూగుల్ ని తలదన్ని మొదటిస్థానాన్ని ఆక్రమించింది కూడా. కానీ.. అది కొన్నాళ్లకే పరిమితమైంది. ‘గూగుల్’ తిరిగి పుంజుకోవడంతో ‘ఫేస్ బుక్’ వెనుకబడింది. అయితే.. తానేమీ తక్కువేం కాదంటూ ‘ఫేస్ బుక్’ పోటీ ఇస్తూ వచ్చింది. చివరికి అది గూగుల్ ఆధిపత్యానికి గండిపెట్టి.. ఇప్పుడు మొదటిస్థానానికి ఎదిగింది.

తాజాగా న్యూస్‌సైట్ల రద్దీపై పర్సాడాట్‌లీ అనే సంస్థ ఓ అధ్యయనం నిర్వహించింది. ఈసారి వెల్లడైన ఈ సర్వేలో అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం వెల్లడైంది. న్యూస్‌సైట్ల రద్దీలో గూగుల్‌ను ఫేస్‌బుక్ వెనక్కు నెట్టింది. ఫేస్‌బుక్, ట్వీటర్‌లో షేర్ చేసిన లింకులు ఇంటర్‌నెట్ వినియోగదారులకు వార్తల కోసం ప్రధాన వనరుగా మారాయని సంస్థ పేర్కొంది. మీడియా సైట్లకు సంబంధించి 43 శాతం రద్దీ ఫేస్‌బుక్ వేదికగా నడుస్తోందని, ఈ విషయంలో గూగుల్ ట్రాఫిక్ 35 శాతానికే పరిమితమైందని పర్సాడాట్‌లీ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ట్రాఫిక్ రేసులో ఫేస్‌బుక్ గూగుల్‌ను అధిగమించడం ఇదే తొలిసారి కాదు. గత అక్టోబరులోనే స్వల్ప ఫేస్‌బుక్ స్వల్ప ఆధిక్యం ప్రదర్శించింది. కానీ ఇప్పుడు ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి.. ఈ దెబ్బతో ‘గూగుల్’ తేరుకుని సరికొత్త ప్రణాళికలేమైనా చేపడుతుందో, లేదో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : google  facebook  internet trafficking  

Other Articles