Hidden agenda behind CBI filing DA case: Former Telecom Minister A Raja

Cbi registers da case against former telecom minister a raja

disproportionate assets (DA), A Raja, telecom, 2G scam, Central Bureau of Investigation (CBI), DMK chief Karunanidhi, Dayanidhi Maran, UPA government, tamil nadu, Perambulur, Modi, NDA government, PM narendra modi, CBI, DMK, Disproportionate case, crime, law and justice, political vendetta

Former Telecom Minister A Raja on Saturday said there "seemed" a "hidden agenda and politics" behind CBI lodging a fresh disproportionate assets case against him.

రాజకీయ కక్షసాధింపుకే ఆదాయానికి మించిన ఆస్తులు కేసు

Posted: 08/22/2015 08:29 PM IST
Cbi registers da case against former telecom minister a raja

2జీ కుంభకోణం కేసులో జైలు జీవితాన్ని గడిపిన టెలికాం శాఖ మాజీ మంత్రి ఏ.రాజాను..  మరిన్ని కష్టాలు ఆలిగనం చేసుకుంటున్నాయి. తమ మద్దతుతో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో మంత్రి బాధ్యతలను స్వీకరించి కుంభకోణాలకు పాల్పడిన రాజను అప్పటి కేసులతో పాటు ఇప్పుడు మరి కోన్ని కేసులు చుట్టముట్టనున్నాయి. 2జీ కుంభకోణానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కోంటున్న ఆయనను తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కూడా ఉచ్చు బిగయనుంది. ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఐదు డైరీల్లో రాజా గుట్టు ఉన్నట్టు తేలడంతో, అందులోని నంబర్లను, వివరాలను సమగ్రంగా సీబీఐ పరిశీలిస్తున్నది.

కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాజా ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్టు సీబీఐ గుర్తించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును రెండు రోజుల క్రితం నమోదు కూడా చేసింది. అదే సమయంలో రాజా ఇళ్లు, ఆయన బంధువులు, కుటుం బీకులు, మిత్రుల ఇళ్లు కార్యాలయాల్లో రెండు రోజులు గా తనిఖీలు కొనసాగుతూ వచ్చాయి. ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల ఆస్తులకు సంబంధించిన రికార్డులు బయట పడ్డట్టు సమాచారం. అలాగే, రాజా లాకరులో 20 కేజీల వెండి, ఆరు కిలోల బంగారం బయట పడింది. ఇంత వరకు బాగానే ఉన్నా, అస్సలు గుట్టు అంతా రాజా డైరీలో దాగి ఉన్నట్టు తేలింది. రాజా ఇంట్లో జరిపిన సోదాల్లో ఐదు డైరీలు లభించినట్టు, ఇందులోనే అస్సలు కథ ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.

నగదు బట్వాడా, వ్యవపార లావాదేవీలతో పాటుగా అనేక వివరాలు, కీలక ఫోన్ నంబర్లు అందులో ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ డైరీని క్షుణ్ణంగా పరిశీలించేందుకు నిర్ణయించినట్టు సీబీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అందులోని మొబైల్ , ల్యాండ్ లైన్ నంబర్లు, కొన్ని కోడ్‌లను పరిగణలోకి తీసుకుని పరిశీలన సాగుతున్నదని, అవసరం అయితే, రాజాను విచారణకు పిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. రాజాతో సాగే విచారణ అనంతరం, ఆయన కుటుంబీకులు, మిత్రుల్ని సైతం విచారించి తదుపరి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయనున్నామన్నారు.

తమిళనాడులో డిఎంకే పార్టీ ఎన్నికల వైపు దూసుకుపోతున్న తరుణంలో.. అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతూన్న నేపత్యంలో ఈ పరిణామాలు చెక్ పెట్టే విధంగా వున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల తరుణం ఆసన్నమైన తరుణంలో ఓ వైపు బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ల వ్యవహారంలో అటు టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ ప్రమేయం విచారణ వేగవంతం సాగుతొంది. ఇటు అదే శాఖకు మంత్రిగా వ్యవహరించిన తనపై కొత్త కేసు నమోదుకావడం రాజాతో పాటు ఇటు డీఎంకే పార్టీకి కూడా శిరోభారంగా మారింది ఈ పరిణామాలన్నీ త్వరితగతిన సాగనున్న దృష్ట్యా, అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ కేసులో రాజ అండ్ బృందాన్ని పోలీసులు అరెస్టు చేసిన పక్షంలో డీఎంకేకు మరింత గడ్డుకాలమే. అయితే ముఖ్యమంత్రి జయలలిత, కేంద్రంలోని నరేంద్రమోడీతో ప్రభుత్వం కలసి తమపై కక్ష సాధింపుగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఏ రాజా అరోపిస్తున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disproportionate case  A.Raja  crime  law and justice  political vendetta  

Other Articles