జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పోరుకు సమాయత్తమవుతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంత రైతులకు తాను అండగా వుంటానని, తమ భూములను బలవంతంగా ప్రభుత్వం లాక్కునేందుకు వీలు లేకుండా అడ్డు నిలబడతానని గతంలో హామీ ఇచ్చిన ఆయన అదే విషయమై సామాజిక మాద్యమం ద్వారా స్పందించినా.. ప్రభుత్వం నుంచి సరైన ప్రతిస్పందన రాకపోవడంతో మండిపడుతున్నారు. అంతేకాదు. తన వ్యాఖ్యలపై మెలికలు పెట్టడం, వ్యంగాస్త్రాలు సంధించడం చేసిన నేతలకు కన్నవిప్పు కల్పించాలని భావిస్తున్నట్లు వున్నారు. అందుకే గత రెండేళ్లుగా టీడీపీతో చెలిమికి గుడ్ బై చెప్పనున్నారు.
షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాదు చేరుకున్న పవన్ ఓ ట్వీట్ తో తనలో పెల్లుబుకుతున్న ఆవేశాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. సొంత అభిప్రాయానికి బదులు విఖ్యాత న్యాయవాది రామ్ జెఠ్మలానీ కామెంట్లను ట్విట్టర్లో పోస్టు చేశారు. "ఓ రాజకీయ పార్టీ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నంత కాలం దానికి మద్దతివ్వడం ధర్మం. అయితే, ఆ రాజకీయ పార్టీ విధానాలు, చర్యలు జాతికి విఘాతం కలిగిస్తున్నప్పుడు కూడా ఆ పార్టీకి మద్దతివ్వడం జాతికి ద్రోహం తలపెట్టడంతో సమానం. రాజకీయాల్లో ఎల్లప్పుడూ జాతి ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి" అన్న రామ్ జెఠ్మలానీ అభిప్రాయాలను పవన్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
దీంతో టీడీపీ జాతి ప్రయోజనాలను కాపాడుతుందని అనుకున్నంత వరకు ఆ పార్టీతో జతకట్టడంలో తప్పులేదని, అయితే రాజధాని పేరుతో వేల ఎకరాల భూములను సేకరించడం, అందులోనూ బహుళ పంటలను పండించే భూములను బలంవంతంగా లాక్కోవడం సరికాదని ఇది జాతి ద్రోహమేనని అయన భావిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే పవన్ కల్యాణ్ ఏపీలో అధికార టీడీపీతో పోరాటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. రేపు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాల్లో పవన్ పర్యటిస్తున్నారు.
అయితే గత నెల రోజులుగా సామాజిక మాధ్యమం ద్వారా పవన్ తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నా.. రాజధాని ప్రాంతంలో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన మెసేజ్ లపై స్పందించకపోవడం.. పైపెచ్చు ఆయన మంత్రివర్గంలోని సభ్యులు మాత్రం మెలికలు పెట్టడం, వ్యంగస్త్రాలు సంధించడం చేయడంతో పవన్ అధికార పార్టీతో పోరుకు సిద్దమయ్యారు. తెగవరకు లాగిన తరువాత.. అతికించి మాత్రం ప్రయోజనమేముంది. అందులోనూ సీనియర్ నాయకుడు, మంతరి యనమల వ్యంగాస్త్రాలు సంధించడంపై మండిపడ్డ పవన్.. ఇక రాజధాని ప్రాంత రైతులు కోసం టీడీపీపై పోరుబాటు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more