Revanth Reddy | cash for vote | KCR | Telangana

Revanth reddy maintaing silence after his return from jail

Revanth Reddy, cash for vote, KCR, Telangana, Cash for cote case, ACB, Revanth Reddy on KCR

Revanth Reddy maintaing silence after his return from jail. On Cash for vote case, Revanth Reddy went to jail after his return, he didnt express his fire and passion.

రేవంత్ రెడ్డి.. ఓ కోరలు తీసిన పాము.. కాదంటారా..?

Posted: 08/24/2015 11:39 AM IST
Revanth reddy maintaing silence after his return from jail

తెలంగాణ టిడిపి ఫైర్ బ్రాండ్, ఓటుకు నోటు వ్యవహారంలో కీలక నిందితుడు రేవంత్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిందా...? నిన్నటి దాకా ఎగిసి ఎగిసి పడ్డ రేవంత్ రెడ్డి ఒక్కసారిగా సైలెంట్ గా మారారు. సందు దొరికితే సమరానికి సై అంటూ కాలుదువ్వే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంలో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత నుండి కిమ్మనకుండా కూర్చున్నారు. జైలు నుండి విడుదల తర్వాత కేసీఆర్ ఖబర్దార్ అంటూ సీరియస్ గా వార్నింగ్ లు ఇచ్చిన రేవంత్ రెడ్డిలో ఫైర్ తగ్గిందా..? ఫైర్ బ్రాండ్ లో ఫైర్ అయిపోయిందా..? కాల్చేస్తాను.. పేల్చేస్తాను అన్న రేవంత్ రెడ్డి తీరిగ్గా ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు. ఇలా సవాలక్ష ప్రశ్నలు కానీ వాటికి చాలా సమాధానాలు వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే రేవంత్ రెడ్డి చల్లబడ్డాడు. మొన్నటి ఫైర్ లేదు.. అసలు రేవంత్ ఇలా కావడానికి కారణాలు ఏంటి..?

రేవంత్ రెడ్డి అరెస్టు ఎంతో సంచలనంగా మారింది. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఎంతో ప్లాన్ వేసి, పూర్తి సాక్షాధారాలతో తెలంగాణ ఏసీబీ పట్టుకుంది. కేసు నుండి తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డికి ఒక్క అవకాశం కూడా ఇవ్వనట్లుగా చాలా పకడ్బందీగా ప్లాన్ వేసి అరెస్టు చేశారు. అయితే ఓటుకు నోటు వ్యవహారం చిలికిచిలికి గాలి వానగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి మూల బిందువుగా మారింది. అయితే రేవంత్ రెడ్డి అరెస్టు తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్లో కలవరం మొదలైంది. రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి కూడా దీని మీద స్పందించారు. రేవంత్ రెడ్డి మీద కక్షసాధింపు చర్యలు చేస్తున్నారని.. మరీ ఇంతలా కక్షసాధింపా అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన కూతురి నిశ్చితార్థానికి కూడా రేవంత్ రెడ్డి ఓ గెస్ట్ లాగా వెళ్లడం కుటుంబ సభ్యులను కూడా కలిచివేసింది.

రేవంత్ రెడ్డి జైలు నుండి విడుదల తర్వాత నియోజక వర్గానికి మాత్రమే పరిమితం కావాలని కోర్ట్ ఆదేశించింది. తమ అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లడానికి వీలులేదని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే అంతకు ముందే రేవంత్ రెడ్డి మనోస్థైర్యం, అతని కుటుంబ సభ్యుల మనోదైర్ఘ్యం దెబ్బతిందని అందరూ అనుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి టిటిడిపి నేత రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు తన ప్లాన్ ను వర్కవుట్ చేశారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చెయ్యడంతో రేవంత్ రెడ్డి నుండి, పరోక్షంగా టిటిడిపి ని దెబ్బతీసినట్లవుతుందని కేసీఆర్ ప్లాన్. ఈ ప్లాన్ పక్కాగా వంద శాతం రిజల్ట్ తీసుకువచ్చింది. రేవంత్ రెడ్డిలో గతంలో ఉన్న ఫైర్ లేదని చాలా మంది అప్పుడే చెవులు కొరికేసుకుంటున్నారట. ఓటుకు నోటు కేసులో అరెస్టయిన తర్వాత రేవంత్ రెడ్డి కోరలు తీసిన పాములా మారారని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  cash for vote  KCR  Telangana  Cash for cote case  ACB  Revanth Reddy on KCR  

Other Articles