No home, woman lives on trains| Viral news

Woman s home on train

woman lives on train, girl house on train, woman travels in train no house, no home woman lives on train

A German student decided to continuously travel on the local trains, taking the monthly ticket costing £240, thus avoiding to stay at a single place.

అద్దిల్లు కావాలా..? రైలుందిగా..! ట్రయిన్ ను నివాసంగా మార్చుకున్న జర్మన్ యువతి..

Posted: 08/25/2015 08:13 PM IST
Woman s home on train

ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యనగరాలు, పట్టణాలలో రోజురోజుకీ పెరుగుతున్న వలసలు, అందుకు తగ్గట్టుగానే పెరుగుతున్న అద్దెలు సాధారణ మధ్యస్థాయి ప్రజలను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. నానాటికీ పెరుగుకు పోతున్న అద్దెలను భరించలేక.. ఇంటి ఓనర్ తో గొడవ పడిన ఓ జర్మనీ యువతి పొదుపు మంత్రాన్ని జపించడంతో పాటు తన అద్దె ఇంటి బాధ నుంచి విముక్తి కల్పించుకుంది. ఈ కొత్త అద్దెంట్లో అమెను ఎవ్వరూ ఏమీ అనరు. ఎంత సేపైనా తన లైటు వేసుకోవచ్చు. చదవుకోవచ్చు. కొత్త వారితో పరిచాయాలు ఏర్పర్చుకోవచ్చు.. అంతే కాదండీ కొత్త ప్రాంతాలను కూడా అమె వీక్షించే అవకాశం కలసివచ్చింది. నిత్య పర్యాటకరాలుగా అమెను మార్చిన అద్దె ఇల్లు మరోదే కాదండి. ధూమశకటం. అదేనండీ పొగబండి. రైలు బండి.

గత ఆరు మాసాలుగా అదే అమెకు నివాసం. లియోనీ ముల్లర్ అనే యూనివర్సిటీ విద్యార్థిని రైలునే తన బసగా మార్చుకుంది. రైలులో తన బట్టలను ఉత్తుకుంటూ.. అక్కడే స్నానాదులు గట్రా చేసుకుంటూ యూనివర్శిటీకి వెళ్లి విద్యాను అభ్యసిస్తుంది. ఇది కొంచెం ఇంటి యజమానులకు చేదు వార్తే అయినా.. అమె సన్నిహితులు మాత్రం అమె చేసే పనికి కితాబిస్తున్నారు. రోజుకో కొత్త ప్రాంతానికి రైలులో పర్యటించి వస్తున్న అమె దైర్యాన్ని, సాహసాన్ని అభినందిస్తున్నారు.  అలా అని అమో రైలు కోసం అదనంగా డబ్బులు ఖర్చు చేయడం లేదు. సరికాదా, తాను గతంలో అద్దెకున్న ఇంటికన్నా తక్కువలోనే దేశ పర్యటన చేస్తుంది. అంతేకాదు 44 పాండ్లను మిగలబట్టుకుని తనకు కావాల్సిన వస్తువులను కోనుక్కోంటుంది.

గతంలో తాను అద్దెకు వున్న ఇంటికి 285మ పాండ్ల అద్దెను కట్టేది.. అదే జర్మనీ దేశవ్యాప్తంగా రైలులో తిరిగేందుకు నెలకు 241 రూపాయలు టిక్కెట్ వుంటే చాలు. ఈ విషయం తెలుసుకున్న లియోనీ.. రైలు పట్టాలనే అధారంగా చేసుకుని నడిచే రైళ్లను తన నివాసంగా మార్చుకుని దేశ సంచారం చేస్తూంది. రైళ్లలోనే అమె చదవుకుంటుంది. తన నోట్సు గట్రా రాసుకుంటుంది. అయితే అమె సంచార జీవయనాయంపై పలువురు నెగిటివ్ గా అనుకున్నా తాను మాత్రం సాధారణ జీవనాన్నే గడుపుతూ నిత్యం కొత్త స్నేహితులతో గడుపుతున్నానని లియోనీ అంటోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Train  travel  viral news  

Other Articles