onion | prices | soar | potato | tomato | prices | crash

As onion prices soar potato and tomato prices crash

onion, onion prices soar, potato and tomato prices crash, potato price, tomato price, production cost, farmets, customers, onions prices make customers cry, potato and tomato prices make farmers cry, below production cost, Farmers, Uttar Pradesh, Punjab, Rajasthan, Rs 4-6 per kg for potato, tomato getting Rs 9 per kg, Bangalore.

While spiraling onion prices is hitting consumers hard, potato and tomato growers are in trouble as prices at the farm gate have crashed below production cost.

ఉల్లి ధరతో కస్టమర్లకు కన్నీళ్లు.. అలు, టమాటా ధరలతో రైతులకు కడగండ్లు..

Posted: 08/25/2015 11:33 PM IST
As onion prices soar potato and tomato prices crash

దేశ వ్యాప్తంగా ఉల్లి ధర ఘాటు వినియోగదారుల నశాలానికి ఎక్కి కన్నీళ్లు పెట్టిస్తున్న సమయంలోనే అటు టమాటా, బంగాళాదుంపలు (ఆలుగడ్డలు) ధరలు మాత్రం గిట్టుబాటు ధర కూడా రాక రైతులకు కండగండ్లను మిగిల్చుతున్నాయి. ఉఃల్లి ధరల పెరగడంతో అటు వినియోగదారులు వాటిని కొనడానికి కూడా అయిష్టతను వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇటు పెట్టిన పెడుబడులు రాకపోవడంతో టమోటా, ఆలు రైతులు లబోదిబోమంటున్నారు. ఆలు, టమోటా ధరలు ఎంతగా పడిపోయాయంటే రైతులు వాటిని పండించేందుకు పెట్టిన పెట్టుబడి ధరలు కూడా రాకపోవడంతో ఊసూరుమంటున్నారు

ఆలు పంటలు పండిని ఉత్తర్ ప్రధేశ్, పంజాబ్, రాజస్తఆన్ రైతులు కేజీకి నాలుగు నుంచి ఆరు రూపాయలు మాత్రమే రావడంతో.. వాటిని కనీసం మార్కెట్లకు తీసుకువచ్చిన ధరలు కూడా గిట్టుబాటు కాక మార్కెట్ల వద్ద ఉచితంగా పంచుతూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా టామోటాల్లోకి రారాజుగా ప్రఖ్యాతి చెందిన బెంగుళూరు టామాటాకే కిలోకు 9 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఇక సాధారణ టమోటాలకు ఐదు నుంచి ఆరు రూపాయల మధ్య ధర పలుకుతుంది. అయితే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాక ఆలు, టమోటా పంటల ధరలు తగ్గింపుపై అధ్యయనం చేస్తుందని, రైతులు అసంతృప్తికి కారణాన్ని కనుగోనే పనిలో వున్నాయని వ్యవసాయ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : onion  onion prices soar  potato and tomatoes  prices crash  farmers  

Other Articles