Sheena Bora Indrani Mukerjea Murder | Peter Mukerjea

Woman allegedly killed by tv tycoons wife indrani mukerjea was her daughter not sister

Indrani Mukerjea, Murder, Peter Mukerjea, Mumbai, PX News, Sheena Bora

Woman allegedly killed by TV tycoons wife Indrani Mukerjea was her daughter not sister Indrani Mukerjea, the wife of former Star India chief Peter Mukerjea, has been arrested for the murder of her daughter Sheena Bora, who was widely known to be her sister until yesterday.

టివి ఛానల్ ఓనర్ భార్యే హంతకురాలు

Posted: 08/26/2015 04:33 PM IST
Woman allegedly killed by tv tycoons wife indrani mukerjea was her daughter not sister

సస్పెన్స్ ధ్రిల్లర్ సినిమాల్లో లాగా ఓ హత్య అంతకంతకు ఉత్కంఠను రేపింది. చివరకు ఓ మీడియా చానల్ భార్య హత్య చేసిందన్న వార్త సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.ఇక అన్నింటి కంటే ట్విస్ట్ ఏంటంటే చంపింది తన కూతురినే. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆమె చనిపోయిన అమ్మాయిని తన సిస్టర్ అని అందరిని నమ్మించింది. ఇలా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ధ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని ఉదంతం ముంబైలో చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో హత్యకు పాల్పడి అరెస్టయిన ఇంద్రాని ముఖర్జియా కేసు కీలక మలుపు తిరిగింది. హత్యకు గురైన షీనా బోరా ఆమె సోదరి కాదని ఆమె సొంత కూతురని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయం తెలిసి ఆమె భర్త స్టార్ ఇండియా మాజీ చీఫ్ పీటర్ ముఖర్జియా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.


గత రెండేళ్లుగా ఎటూ తేలకుండా ఉన్న ఈ కేసు విషయంలో కారు డ్రైవర్ సమాచారం మేరకు ఇంద్రాని అరెస్టు చేసిన పోలీసులు తొలుత షీనా బోరా సోదరి అని పొరపడ్డారు. కానీ కొన్ని గంటల విచారణ అనంతరం షీనా ఇంద్రాని కూతురు అని తేలింది. ఫొరెన్సిక్ ల్యాబ్ నివేదిక కూడా రావాల్సి ఉంది. కూతురు షీనా బోరా విషయంలో ప్రశ్నించగా ఆమె కనిపించడంలేదని, కనిపించకుండా పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా పోలీసులకు ఇవ్వకపోవడంతో వారి అనుమానం మరింత బలపడింది. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మొత్తం వ్యవహారం తెలుసుకున్న పీటర్ ముఖర్జి అవాక్కయ్యారు. అసలు ఆ అమ్మాయిని తన భార్య చెల్లెలు అనుకున్నానని.. కానీ అది వాస్తవం కాదని తేలిందని అన్నారు. అలాగే ఎంతో కాలంగా తన భార్య మీద వివాదాలు వస్తున్నా కానీ అనుమానించలేదని.. ఇప్పుడు మాత్రం అనుమానం కలుగుతోందని ఎందుకంటే దానికి తగిన సాక్షాధారాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి ఆస్తి వ్యవహారమో లేదంటే.. అక్రమ సంబందమో తెలియదు కానీ దేశ వ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indrani Mukerjea  Murder  Peter Mukerjea  Mumbai  PX News  Sheena Bora  

Other Articles