Actor Sanjay Dutt granted 30-day parole to attend daughter's nose surgery

Sanjay dutt gets 30 day parole for daughter s nose surgery

sanjay dutt, sanjay dutt parole, sanjay dutt jail term, sanjay dutt actor, parole sanjay dutt, news, parole, blasts, mumbai blasts,Sanjay Dutt Daughter,Sanjay Dutt parole,Trishala Dutt, Yerwada Jail

Sanjay Dutt may spend a day or two more at the Yerwada Jail before the formalities are completed for his release on parole.

మళ్లీ 30 రోజుల పేరోల్ పై బయటకు రానున్న సంజయ్ దత్

Posted: 08/26/2015 06:41 PM IST
Sanjay dutt gets 30 day parole for daughter s nose surgery

అక్రమ ఆయుధాల కేసులో దోషిగా ఫూణేలోని ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది. సంజయ్ దత్ కు మరో 30 రోజుల పాటు పేరోల్ కు అనుమతిస్తూ ఫూణే డివిజనల్ కమీషనర్ అనుమతించారు. సంజయ్ కుమార్తె ముక్కుకు శస్త్ర చికిత్స చేయనున్న నేపథ్యంలో ఆమె మంచి చెడులు చూసుకునే ఉద్దేశంతో పెట్టుకున్న పెరోల్ బెయిల్కు పోలీసులు అనుమతించింది. తనకు పేరోల్ కావాలని సంజయ్ దత్ తరపున ఆయన న్యాయవాది ఫూణే పోలీస్ కమీషనర్ చోకలింగం జూలై మాసంలో దరఖాస్తు చేయగా, రెండు రోజుల క్రితం పోలిస్ కమీషనర్ సమ్మతించి సంజయ్ కు పేరోల్ అనుమతించారు.30 రోజులపాటు సంజయ్ దత్ పెరోల్పై జైలు వెలుపల ఉండనున్నారు.
 
కాగా జైలు అధికారులు నిబంధనలు పూర్తి చేసుకుని ఆయన బయటకు వచ్చేందుకు ఒకటి రెండు రోజుల సమయం పట్టవచ్చని అధికారులు తెలిపారు. ఎర్రవాడ జైలు సూపరింటెండెంట్ ఉత్తమ్ కుమార్ ఈ విషయమై స్పందిస్తూ.. తమకు పేరోల్ కాపీ అందిందని అయితే ఇప్పుడ తరువాత కార్యక్రమాలను మొదలు పెట్టామని చెప్పారు. సంజయ్ దత్ 1993లో ముంబయిలో జరిగిన సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధాన్ని కలిగివున్న కేసులో ఖైదీగా ఉన్నారు. 2013 మేలో టాడా కోర్టు ఆయనకు శిక్షను ఖారారు చేసిన తరువాత అక్టోబర్ లో దత్ ఫర్ లాప్ పోందారు, 2014 జనవరిలో 30 రోజుల కోసం పేరోల్ పొందిన ఆయన దానిని 60 రోజులకు పోడిగించుకున్నారు. ఆ తరువాత డిసెంబర్ 2014లో మరోమారు 14 రోజుల ఫర్లాఫ్ పోందారు. ఆయనకు తరుచూ పెరోల్ మంజూరు చేయడాన్ని నిరసిస్తూ గతంలో కొందరు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇలాగే ఆయనకు పెరోల్ ఇచ్చుకుంటూ వెళితే ఇతర ఖైదీలు కూడా పెరోల్ మంజూరుచేయాలని డిమాండ్ చేసే ప్రమాదం ఉందని ఆ పిల్లో హెచ్చరించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay Dutt  30-Day Parole  Daughter's Nose Surgery  Yerwada Jail  

Other Articles